దాదాపు రెండొందల ఏళ్ళ దాస్యశృంఖలాలకు, బానిస బ్రతుకులకు తెల్ల దొరల పాలిట నుండి విముక్తి కలిగించి, ఈ సువర్ణ భూమిపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేసిన ఘనులెందరో.. సమరయోధులుగా, అమరజీవులుగా వారి చరిత్ర ఎప్పటికీ మనకు కనువిప్పే. స్వేచ్చాభారతావని కోసం మన వాళ్ళు పడిన పాట్లు, అప్పటి ప్రజానీకం ఎదుర్కున్న ఇక్కట్లు, తెల్లవాళ్ళను మనవాళ్ళు తరిమికొట్టిన పిమ్మట వినిపించిన చప్పట్లు ఎప్పటికీ మనకు స్మురింపజేయడానికి తెలుగు సినిమా కూడా తన వంతు కృషిచేస్తూనే వుంది.
స్వాతంత్ర్య సమయం నేపధ్యంలో, స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రల స్పూర్తితో ఎన్నో తెలుగు సినిమాలు ఇప్పటికే భారతమాత రుణాన్ని తీర్చుకునే క్రమంలో వున్నాయి. 1982లో బెన్ కింగ్ స్లే నటించిన 'గాంధీ' సినిమా ఆంగ్ల బాషలో తెరకేక్కినా తెలుగునాట సైతం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. మన్నెం వీరుడిగా అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రను సూపర్ స్టార్ కృష్ణ గారు కళ్ళకు కట్టినట్టు చూపించారు. కట్ట బ్రహ్మణ, ఛత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్ ల జీవిత చరిత్రను పుణ్య భూమి నాదేశం అంటూ ఎన్.టి.ఆర్ మనకు వినిపించారు. వెంకటేష్ నటించిన సుభాస్ చంద్రబోస్ 1947నేపధ్యంలో వచ్చిన సినిమానే. నాగార్జున 'రాజన్న' కూడా ఇటువంటి కధాంశమే.
ఇక భార'తీయ'త పై మక్కువ చూపిన సినిమాలకు కూడా కొదవ లేదు. కృష్ణవంశీ 'ఖడ్గం', తేజా 'జై', రామ్ గోపాల్ వర్మ '26/11 ఎటాక్స్' ఈ కోవకే చెందుతాయి. కమల్ హాసన్ భారతీయుడు, చిరంజీవి స్టాలిన్, పవన్ కళ్యాణ్ పులి, నాగార్జున ఆజాద్ సినిమాలు మన తెలుగువాడిలో దాగున్న భారతీయుడిని నిద్రలేపి సినిమా ద్వారా సెల్యూట్ కొట్టిస్తాయి. సినిమా పాటలో ముగించాలంటే "పాడవోయి భారతీయుడా.. ఆడిపాడవోయి విజయగీతికా!!!"