యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన చిత్రం 'విక్రమ్'. కమల్ సినిమా థియేటర్లలో సందడి చేసి దాదాపు నాలుగేళ్లవుతోంది. 'విశ్వరూపం 2' తరువాత కమల్ నుంచి మరో సినిమా రాలేదు. మళ్లీ ఇన్నేళ్లకు కమల్ నుంచి వచ్చిన మూవీ 'విక్రమ్'. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవల విడుదలై వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో ఇటీవల 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లని రాబట్టింది.
తెలుగులో ఈ మూవీని క్రేజీ హీరో నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై విడుదల చేశారు. ఊహించిన దానికి మించి ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ విజయవంతంగా ప్రదర్శింపబడుతూ విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీలోని కీలక పాత్రల్లో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, నరేన్ నటించారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే రోలెక్స్ పాత్రలో హీరో సూర్య కనిపించి అదరగొట్టేశారు.
నెక్స్ట్ సీక్వెల్ ఓ రేంజ్ లో వుండబోతోందని, ఢిల్లీ (హీరో కార్తి), విక్రమ్ కలిసి రోలెక్స్ పై యుద్దం ప్రకటించబోతున్నారంటూ హింట్ ఇచ్చేశారు. ఇదిలా వుంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కమల్ హాసన్ గత ఏడాది అర్థాంతరంగా నిలిచిపోయిన 'ఇండియన్ 2'ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ సినిమా త్వరలోనే మిగతా మొదలవుతుందని, బ్యాలెన్స్ గా వున్న షూటింగ్ ని పూర్తి చేసుకుంటుందని, ఈ విషయమై నిర్మాతలతోనూ చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.
'విక్రమ్' బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేస్తూ భారీ వసూళ్లని రాబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి ఇప్పడు శంకర్ 'ఇండియన్ 2'పై పడింది. క్రేన్ యాక్సిడెంట్ కారణంగా టీమ్ లోని నలుగురు సభ్యులు మృతి చెందడం తో శంకర్ కు నిర్మాతలకు మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవి తారా స్థాయికి చేరడంతో సినిమా షూటింగ్ ని అర్థాంతరంగా నిలిపివేసి శంకర్ .. చరణ్ సినిమాకు వెళ్లిపోయాడు.
కమల్ హాసన్ 'విక్రమ్' మూవీకి వచ్చేశాడు. తాజాగా విడుదలైన 'విక్రమ్' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని రాబడుతున్న నేపథ్యంలో 'ఇండియన్ 2' ని మేకర్స్ తిరిగి ప్రారంభించే అవకాశం వుందని, ఈ దిశగా మేకర్స్ ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
శంకర్ RC15 ని పూర్తి చేసిన వెంటనే 'ఇండియన్ 2' ని తిరిగి ప్రారంభించి పూర్తి చేస్తారని, ప్రస్తుతం కమల్ కూడా ఖాలీగానే వున్నారు కాబట్టి ఆయన ఇప్పటికే తను కూడా షూటింగ్ ని పునః ప్రారంభించాలనుకుంటున్నానని స్పష్టం చేసిన నేపథ్యంలో 'ఇండియన్ 2' ప్రాజెక్ట్ కు మోక్షం లభించినట్టే నని వార్తలు వినిపిస్తున్నాయి.