పవన్ కళ్యాణ్ సినిమా అంటే జనాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ క్రేజ్ వాడుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో నెలకొన్న క్రేజ్ ను నిర్మాత శరత్ మరార్ ఫుల్లుగా వాడేసుకుని రికార్డు స్థాయిలో సినిమాను అమ్ముకున్నాడు. నైజాం ఏరియాకు ఇంద్ర ఫిలిమ్స్ సంస్థ ఏకంగా రూ.20 కోట్లు పెట్టి రైట్స్ తీసుకుంది. అంత పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్ కూడా పవన్ సినిమాకున్న క్రేజ్ ను ఫుల్లుగా వాడేసుకోవడానికే చూస్తున్నాడు. క్రేజున్న సినిమాలకు థియేటర్ల యజమానులు డిస్ట్రిబ్యూటరుకి అడ్వాన్సులిచ్చి సినిమాను తీసుకోవడం మామూలే. ఐతే ఈ సంప్రదాయం సింగిల్ స్క్రీన్లకు మాత్రమే పరిమితం. మల్టీప్లెక్సుల యజమానులు అడ్వాన్సులివ్వడం అన్నది ఇప్పటిదాకా జరగలేదు.
ఐతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డిస్ట్రిబ్యూటర్ మాత్రం మల్టీప్లెక్సుల నుంచి కూడా అడ్వాన్సులడుగుతున్నాడు. భారీ ధర పెట్టి సినిమాను కొన్న నేపథ్యంలో విడుదలకు ముందే పెట్టుబడి చేతికి వచ్చేయాలన్న ఉద్దేశంతో అడ్వాన్సుల విషయంలో పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఐతే ‘సర్దార్..’ విషయంలో ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ.. తమ డబ్బులకేమీ ఢోకా లేనప్పటికీ.. ఒకసారి ఇందుకు ఒప్పుకుంటే ఇక ప్రతి పెద్ద సినిమాకూ ఇదే పద్ధతి కొనసాగుతుందన్న భయంతో మల్టీప్లెక్సుల యాజమాన్యాలు వెనక్కి తగ్గుతున్నాయట. ఐతే డిస్ట్రిబ్యూటర్ మాత్రం అడ్వాన్సులివ్వాల్సిందే అని పట్టుబడుతున్నాడట. అందుకే పెద్ద సినిమాలకు వారం ముందే బుకింగ్స్ ఓపెన్ చేసే కొన్ని మల్టీప్లెక్సులు సైతం ఇంకా బుకింగ్స్ మొదలుపెట్టలేదు. నైజాం థియేటర్ల లిస్టులో మల్టీప్లెక్సులు కనిపించకపోవడానికి కూడా ఇదే కారణం. ఈ రోజో రేపో వ్యవహారం తేల్చకుండా ‘సర్దార్..’ ఓపెనింగ్స్ మీద ప్రభావం పడటం ఖాయం.