జెంటిల్ మన్ కి ముందు ఉత్తమ విలన్

Update: 2016-06-22 09:30 GMT
తాము ప్రయత్నిస్తున్న జోనర్ మొదటి సారే అయినా పకడ్బందీ కధాకధనాలతో విజయం సాధించారు మోహన్ కృష్ణ ఇంద్రగంటి - నానిల ద్వయం. ఈ సినిమా కధంతా రాసుకున్నాక మొదట చెప్పిందంతా ఒకెత్తు చివర పది నిముషాలు మరో ఎత్తని, ఆ భాగమే సినిమాకు ప్రధాన బలమని చెప్పుకొచ్చాడు దర్శకుడు. అయితే సగటు ప్రేక్షకుడికి అన్ని ట్విస్ట్ లు ఒకేసారి అర్ధమవుతాయా లేదా అన్న భయముండేదని, కానీ ఫస్ట్ షో టాక్ తోనే అవన్నీ తీరిపోయాయని ఆనందపడ్డాడు దర్శకుడు.

ఈ సినిమాకు జెంటిల్ మన్ కంటే ముందు చాలా పేర్లు పరిశీలించామణి. ఉత్తమ విలన్ అన్న టైటిల్ దగ్గర చాలా ఆలోచించామని అయితే అది ఇటీవలే కమల్ హాసన్ చెయ్యడంతో జెంటిల్ మన్ కే మగ్గు చూపాల్సివచ్చిందని తెలిపాడు. అష్టాచమ్మా సినిమాతో స్వాతి - ఈ సినిమాతో నివేద లైం లైట్ లోకి రావడం తనకి గర్వకారణమన్నాడు.

తన సినిమాలో స్టార్లు నటులుగా మారాలని కానీ చాలా మంది ప్రేక్షకులకు స్టార్లను స్టార్లుగానే చూడాలని కోరుకుంటారని అందుకే ఆయన పెద్ద హీరోలతో సినిమాలు చెయ్యడానికి సంకోచిస్తానని చెప్పుకొచ్చాడు. ఇంద్రగంటి తీసిన గ్రహణం - అష్టాచమ్మా - గోల్కొండ హై స్కూల్ ఇప్పుడు జెంటిల్ మన్ ప్రతీ చిత్రంలో తనలో వున్న కొత్త టాలెంట్ ని చూపిస్తున్నాడు. ఎప్పటికైనా విదేశీ గడ్డపై మన తెలుగు సినిమా గర్వంగా నిలబడేలాంటి చిత్రం చెయ్యాలన్నది ఆయన కోరికట.
Tags:    

Similar News