ట్రైలర్ టాక్: ఇండియా ఎమర్జెన్సీ

Update: 2017-06-17 04:25 GMT
భారత దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన ఘట్టం ఎమర్జెన్సీ విధించడం. ఇదే థీమ్ తో ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ 'ఇందు సర్కార్' అంటూ మూవీ రూపొందించేశాడు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించడంపై రాష్ట్రపతి ప్రకటన చేయడంతో మొదలయ్యే ట్రైలర్.. అన్ని కోణాల్లోనూ ఆకట్టుకుంది.

ఎమర్జెన్సీ సమయంలో జరిగిన హింస.. ఆ హింసకు ప్రభావితం కావడంతో ఓ మహిళ పోరాటం చేయడం అనే థీమ్ తో సినిమా సాగనుండగా.. ఎమర్జెన్సీని వ్యతిరేకించే పాత్రలో కృతి కుల్హరి నటించింది. ఈ ట్రైలర్ అత్యంత ఎక్కువగా ఆకట్టుకునే పాత్ర నీల్ నితిన్ ముకేష్ దని చెప్పాలి. పాత్ర ప్రకారం చూసుకుంటే.. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ రోల్ ను చేశాడని చెప్పచ్చు. ఈ రోల్ ను నీల్ నితిన్ ఎంతగా మెప్పించేశాడంటే.. అతని నటనా ప్రతిభకు ఆశ్చర్యపోవడం ఖాయం. ఇందిరా గాంధీ పాత్రను కూడా ట్రైలర్ లోనే చూపించగా.. ఈ రోల్ ను సుప్రియా వినోద్ పోషించారు.

సామాజిక అంశాలపై సినిమాలు తీయడం ఈ దర్శకుడికి కొత్తేమీ కాదు కానీ.. దేశంలో రాజకీయంగా అత్యంత కీలకమైన ఘట్టంపై.. అది కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రూపొందిన ఈ చిత్రంపై ప్రతిఘటన ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది. ట్రైలర్ చూస్తే మాత్రం.. చెప్పినట్లుగానే జూలై 28న రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ ఖాయం అనిపించక మానదు. అనుమాలిక్-బప్పీలహరి తొలిసారిగా కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించడం మరో అరుదైన విషయం.


Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News