ప‌వర్ ప్యాక్డ్ పంచ్ ల వెనుక ఇండ‌స్ట్రీ శ‌క్తులు?

Update: 2021-09-26 07:30 GMT
`రిప‌బ్లిక్` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేరుగా ఏపీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన సంగ‌తి తెలిసిందే. ప‌రిశ్ర‌మ విష‌య‌మై జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్నది స‌రికాద‌ని విమ‌ర్శించారు. మ‌ధ్య మ‌ధ్య‌లో రిప‌బ్లిక్ గురించి మాట్లాడుతూ..ఆయ‌న మెయిన్ కాన్సంట్రేష‌న్ అంతా ఏపీ ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌ట్టడంపైనే ఉంద‌ని క్లియ‌ర్ క‌ట్ గా అర్ధ‌మైంది. దీంతో ప‌వ‌న్  సినిమా ప్ర‌మోష‌న్ కొచ్చారా?  లేక రాజ‌కీయ ప్ర‌సంగాల‌కు వ‌చ్చారా? అన్న సందేహం చాలా మందికి క‌లిగింది. మునుపెన్న‌డూ లేని విధంగా ప‌వ‌న్ క‌ళ్య‌ణ్ మొద‌టి సారి ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌టం ఆశ్చ‌ర్య‌క‌రంగా అనిపించింది. ప్ర‌జాక్షేతంలోకి వెళ్ల‌క ముందు సినిమాలు త‌ప్ప‌! ఇంకే విష‌యంలో ఆయ‌న వేలు పెట్టేవారు కాదు. పార్టీ స్థాపించిన త‌ర్వాత పూర్తిగా ప్ర‌జ‌ల ప‌క్షానే మాట్లాడేవారు.

కానీ నిన్న‌టి రోజున ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల గురించి.. థియేట‌ర్ల గురించి మాట్లాడ‌టం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొచ్చింది. ఇదే స‌మ‌యంలో వేదిక వ‌ద్ద నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ప‌వ‌న్ ఏపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తుంటే రాజుగారు ఏ రేంజ్ లో న‌వ్వారో వీడియోలు చూస్తే అర్థ‌మ‌వుతోంది. మ‌రీ ముఖ్యంగా రాజు గారు మీరు రెడ్డి గారే క‌దా..సీఎం రెడ్డి గారితో సెట్ చేసుకోండి.. మీకెందుకండి ఈ స‌మ‌స్య‌లు అని ఫ‌న్నీగా ప‌వ‌న్ అన్నారు. ఇలా ఏ కోణంలో చూసినా ప‌వ‌న్ ఎజెండా ఏపీ ప్ర‌భుత్వంపై ఎటాక్ చేయ‌డ‌మేన‌ని తేలిపోయింది. మ‌రి ప‌వ‌న్ ఈ వేదిక‌నే ఎందుకు ఎంచుకున్నార‌న్న‌ది క్లారిటీగా తేలాల్సి ఉంది.

ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వాన్ని..సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని విమ‌ర్శించాల‌నుకుంటే నేరుగా  మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి విమ‌ర్శించొచ్చు. కానీ అలా చేయ‌కుండా `రిప‌బ్లిక్` అనే సినిమా వేదిక‌గా చేసుకుని దాడిగి దిగారు. మ‌రి ఇలా అనుకోకుండా ప‌వ‌న్ చెల‌రేగిపోయారా?  లేక ప్రీ ప్లాన్డ్ గానే ఇదంగా జ‌రిగిందా? అన్న క‌శ్చ‌న్ కూడా రెయిజ్ అయింది. అయితే ప‌వ‌న్ వ‌ద్ద ఆ స‌మ‌యంలో స్క్రిప్టు ఉంది. ఈ నేప‌థ్యంలో ఇదంతా  ప్రీ ప్లాన్డ్ గానే అనే  మాట బ‌లంగా వినిపిస్తోంది.  ప‌వ‌న్ వెనుక దిల్ రాజు లేదా ఇత‌ర ప‌రిశ్ర‌మ శ‌క్తులు  ఉన్నాయ‌నే  సంకేతాలు అందుతున్నాయంటూ ఒక గుస‌గుస వేడెక్కిస్తోంది. రాజు గారు లేదా ఆ నలుగురు లేదా ఇండ‌స్ట్రీ బిగ్ షాట్స్ కార‌ణంగానే  థియేట‌ర్లు.. ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల గురించి మాట్లాడార‌నే టాక్ వినిపిస్తోంది. గ‌తంలో ప‌వ‌న్ చాలా సినిమా ఫంక్ష‌న్ల‌కు అతిధిగా హాజ‌ర‌య్యారు. కానీ ఆ వేదిక‌ల‌పై కేవ‌లం సినిమా గురించి మూడు ముక్క‌లు మాట్లాడి జైహింద్ చెప్పేసారు. కానీ రిప‌బ్లిక్ వేదిక‌పై ప‌వ‌న్ కొత్త సినిమా చూపించిన‌ట్లు క‌నిపిస్తోంది!! అంటూ ఒక‌టే చ‌ర్చ వేడెక్కిస్తోంది.

ప‌వ‌న్ కంటే ముందు బాల‌య్య కూడా..

ఈ క‌రోనా క‌ష్ట కాలంలో సినీప‌రిశ్ర‌మ బాగు విష‌యంలో ఇరు తెలుగు రాష్ట్రాలు స్పందిస్తున్న తీరు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏమైందో కానీ ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి టాలీవుడ్ విష‌య‌మై ఏదో జ‌రుగుతోంద‌న్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయ కార‌ణాల‌తో వ‌కీల్ సాబ్ టిక్కెట్టు ధ‌ర‌ల‌పై పంచ్ వేసిన ఏపీ ప్ర‌భుత్వం టిక్కెట్టు ధ‌ర‌ల త‌గ్గింపు జీవోని రిలీజ్ చేయ‌డంతో అది ప‌రిశ్ర‌మ‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. రాజ‌కీయ కార‌ణాల‌తో సినీప‌రిశ్ర‌మ‌ల్ని టార్గెట్ చేస్తున్నారా? అంటూ కొన్నాళ్లుగా ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. నిజానికి టాలీవుడ్ కి ఏపీ ప్ర‌భుత్వం వ్య‌తిరేకం కాదు.. ఈ రంగంలో ఉన్న కొంద‌రు అంటేనే వ్య‌తిరేకం అన్న చర్చా హీట్ పెంచుతోంది.

అయితే ఇలాంటి స‌న్నివేశంలో న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఓ చానెల్ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం కన్ ఫ్యూజషన్ లో ఉందని ఏం చేస్తోందో అర్థం కాని ప‌రిస్థితిలో ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. క్రైసిస్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కొంత‌వ‌ర‌కూ స్ప‌ష్ఠ‌త వ‌చ్చినా ఏపీలో క్లారిటీ రాలేద‌ని అన్నారు. ఏపీలో టిక్కెట్ రేటు స‌హా ఆక్యుపెన్సీ మ్యాట‌ర్స్ లో త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని అన్నారు. మ‌రీ దారుణంగా ఏపీలో రూ20.. రూ.30 టిక్కెట్టు ధ‌ర‌ల్ని నిర్ణ‌యిస్తే ఎలా?  నిర్మాత‌లు నిల‌బ‌డ‌తారా?  ఎగ్జిబిష‌న్ రంగం ఉండాలి క‌దా! అని బాల‌య్య వ్యాఖ్యానించారు. ఇండ‌స్ట్రీ బాగు ప‌డాలంటే ప్ర‌భుత్వాలు సాయ‌ప‌డాల‌న్నారు.

పెద్ద సినిమాల కోసం జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చినా చిన్న సినిమాల కోసం రారు. చిన్న నిర్మాత‌ల‌ను ఆదుకోవాలి. అలాంటి నిర్మాత‌ల‌తో నేను మాట్లాడ‌తాను అని అన్నారు. ఇండస్ట్రీ ఇలా అయితే బాగుపడదు. విద్యుత్ టారిఫ్  స‌హా థియేట‌ర్ల‌ మెయింటెన్స్ ఖర్చులు పోవాలి. బ‌య్య‌రు పంపిణీదారు ఎగ్జిబిట‌రు అంతా బావుండాలి.. అని అన్నారు. చిన్న నిర్మాత‌లు కూరుకుపోతున్నారు.. వారి బాగుకు నిర్మాత‌ల మండ‌లి ఏదైనా పాల‌సీ మార్చాల‌ని సూచించారు.

ఏపీలో జీవో త‌లా తోకా లేని బీఫార‌మ్ లా ఉంద‌ని బాల‌య్య ఎద్దేవా చేశారు. దీనివ‌ల్ల‌నే ఓటీటీల్లో రిలీజ్ చేయ‌క త‌ప్ప‌డం లేద‌ని ... ఇదేమిటో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు అర్థం కావ‌డం లేద‌ని త‌న‌దైన శైలిలో ఏపీ ప్ర‌భుత్వంపై పంచ్ లు వేసారు. ఆ ష‌ర‌తులేమిలో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేద‌ని అన్నారు. ప్ర‌భుత్వాలు స‌హ‌క‌రించ‌క‌పోతే ప‌రిశ్ర‌మ మ‌నుగ‌డ సాగించ‌ద‌ని అన్నారు. ఇక ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం సింగిల్ స్క్రీన్ల‌కు పార్కింగ్ ఫీజు వెసులు బాటు స‌హా ప‌లు అవ‌కాశాల్ని క‌ల్పించిన సంగ‌తి తెలిసిన‌దే. బాల‌య్య త‌ర్వాత ఇప్పుడు రిప‌బ్లిక్ వేదిక‌పై ప‌వ‌న్ నిప్పులు చెర‌గ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.
Tags:    

Similar News