ఇండస్ట్రీ హిట్‌ కొట్టినా రెండేళ్లు ఆగాల్సి వచ్చింది

Update: 2019-11-29 06:40 GMT
ఒకప్పుడు దర్శకులు ఒకే సమయంలో మూడు నాలుగు సినిమాలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకే దాసరి.. రాఘవేంద్ర రావు లాంటి వారు శతాధిక చిత్రాలు చేశారు. కాని ఇప్పుడు దర్శకులు కెరీర్‌ మొత్తంలో కూడా పాతిక సినిమాలు చేయడం చాలా గొప్ప విషయం అయ్యింది. ఒక సినిమా తర్వాత ఒకటి అన్నట్లుగా సినిమాలు చేస్తున్న దర్శకులకు హీరోల డేట్లతో సమస్య వస్తుంది. అలా పలువురు దర్శకులు సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకటి అన్నట్లుగా సినిమాలు విడుదల చేస్తున్నారు.

గత ఏడాది మార్చిలో అంటే దాదాపు రెండు సంవత్సరాల క్రితం దర్శకుడు సుకుమార్‌ 'రంగస్థలం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా నాన్‌ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది. ఇండస్ట్రీ టాప్‌ చిత్రాల జాబితాలో చేరింది. అంతటి సూపర్‌ హిట్‌ మూవీ తర్వాత సుకుమార్‌ క్రేజ్‌ రెట్టింపు అయ్యింది. ఆయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు హీరోలు ఆసక్తిగా ఉన్నారు. కాని ఎవరికి వారు బిజీగా ఉండటం వల్ల ఆయన తదుపరి చిత్రంకు ఏకంగా రెండు సంవత్సరాలు పట్టింది. రంగస్థలం విడుదల అయిన వెంటనే మహేష్‌ బాబుతో సినిమా అనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల అది సెట్స్‌ పైకి వెళ్లలేదు.

మహేష్‌ బాబు సినిమా క్యాన్సిల్‌ అవ్వడంతో బన్నీతో సుకుమార్‌ మూవీకి సిద్దం అయ్యాడు. అప్పటికే త్రివిక్రమ్‌ కు అల వైకుంఠపురంలో సినిమాకు డేట్లు ఇచ్చిన కారణంగా బన్నీ సుకుమార్‌ ను వెయిటింగ్‌ లో పెట్టాడు. అదుగో ఇదుగో అంటూ సుకుమార్‌ ను ఇంకా కూడా వెయిటింగ్‌ లోనే బన్నీ ఉంచాడు. అల వైకుంఠపురంలో సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కనుక ఇప్పుడు మరో సినిమాను బన్నీ మొదలు పెట్టే అవకాశం లేదు. అంటే సుకుమార్‌.. బన్నీ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉంది. అంటే రంగస్థలం విడుదలైన దాదాపు రెండు సంవత్సరాలకు బన్నీతో సుకుమార్‌ మూవీ స్టార్ట్‌ చేయబోతున్నాడు.

ఇక రంగస్థలం విడుదలై మూడు ఏళ్లు అయ్యే టైంకు సుకుమార్‌ ఈ సినిమాను విడుదల చేస్తాడేమో అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి. ఇండస్ట్రీ హిట్‌ కొట్టి మరీ ఇంత కాలం ఆగాల్సి రావడం సుకుమార్‌ దురదృష్టం అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సుకుమార్‌ లేట్‌ గా వచ్చినా సూపర్‌ హిట్‌ తో వస్తాడనే నమ్మకంను ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు
Tags:    

Similar News