ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ రాజధానిని తెరపైకి తెచ్చాక ఆ నగరం పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. నేటి నుంచి ఏపీలో థియేటర్లు తెరిచేస్తున్నారన్న ప్రచారం సాగిపోయింది కాబట్టి విశాఖలో థియేటర్లు తెరిచారా లేదా? అన్నది ఆరా తీస్తే ఓ ఆసక్తికర సంగతి తెలిసింది.
బీచ్ సొగసుల విశాఖ నగరంలో తొలిగా ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్ ని ఓపెన్ చేయడం విశేషం. అన్ లాక్ నిబంధనల్లో భాగంగా థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతించాక ఏపీలో తొలిసారిగా డేర్ చేసింది ఐనాక్స్ చైన్ మాత్రమే. ఇక నగరంలో కుప్పలుగా సింగిల్ స్క్రీన్లు.. మల్టీప్లెక్స్ స్క్రీన్లు అందుబాటులో ఉన్నా ఇవన్నీ ఎప్పటికి తెరుచుకుంటాయి? అన్నదానిపై ఏమాత్రం క్లారిటీ లేదు.
ప్రస్తుతానికి విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న వరుణ్ ఐనాక్స్ ను తెరిచారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి సీటింగ్ ను పెట్టి సినిమాను కూడా ప్రదర్శించారట. జనం కూడా వచ్చారండోయ్ అని థియేటర్ వాళ్లు చెబుతున్నారు. ఇప్పటికి ఐనాక్స్ తెరిచారు. రేపటి నుంచి సిటీలో జగదాంబ థియేటర్ ని కూడా తెరుస్తున్నారట. నిరంతరం కళకళలాడే జగదాంబ జంక్షన్ లో సినిమా మూత పడి ఏడు నెలలైంది. వైజాగ్ లో అతిపెద్ద స్క్రీన్ అండ్ సీటింగ్ దాంతో పాటే మంచి డీటీఎస్ సౌండింగ్ ఉన్న జగదాంబ థియేటర్ కూడా రేపటి నుంచి తెరుచుకోనుండడం ఆసక్తికరం. అయితే జనం ఏమేరకు థియేటర్లలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారు? అన్నది వేచి చూడాలి. అన్నట్టు 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ రన్ అయ్యిందా? అన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తున్న విషయం.