పునీత్‌ సంతాప సభలో స్టార్‌ హీరోకు అవమానం

Update: 2021-11-17 11:30 GMT
కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్ రాజ్ కుమార్‌ మృతిని ఇప్పటికి కూడా ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. వారాలు గడిచి పోతున్నా కూడా ఆయనపై ఉన్న అభిమానంను జనాలు చూపిస్తూనే ఉన్నారు. ఆయన మృతి చెందిన సమయంలో భారీ ఎత్తున జనాలు తరలి వచ్చి ఆయన చివరి చూపు కోసం పడిగాపులు కాచారు. ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్‌ కార్యం కు కూడా అన్నదానంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా చిన్నపాటి తొక్కీసలాట జరిగింది. తాజాగా పునీత్ రాజ్ కుమార్‌ సంతాప సభను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే ఈ సంతాప సభకు కూడా భారీ ఎత్తున జనాలు వస్తారనే ఉద్దేశ్యంతో పాస్‌ లు ఉన్న వారికి మాత్రమే అనుమతి అంటూ ప్రకటించి ప్రముఖులకు మరియు అభిమాన సంఘాల వారికి పాస్ లను పంపించడం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు వందకు పైగా వీఐపీలు హాజరు అయిన కార్యక్రమం కనుక పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.

ముందు నుండి అనుకున్నట్లుగా పాస్ లు లేకుండా అస్సలు సంతాప సభ ప్రాంగణంలోకి కూడా జనాలను అడుగు పెట్టనివ్వలేదు. ఈ సమయంలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం కన్నడ సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో తెగ చర్చనీయాంశంగా మారింది. పునీత్ రాజ్ కుమార్ సంతాప సభకు గాను కన్నడ స్టార్‌ హీరో అయిన దర్శన్ హాజరు అయ్యేందుకు అక్కడకు చేరుకున్నాడు. ఆయన చేతిలో పాస్ లేకపోవడంతో లోనికి వెళ్లనిచ్చేది లేదు అంటూ పోలీసులు అడ్డుకున్నారు. దర్శన్‌ ఒక స్టార్‌ హీరో కావడంతో పాస్ లేకుండానే పంపించాల్సి ఉంటుంది. కాని పోలీసులు మాత్రం అత్యుత్సాహంతో ఆయన్ను బయటే నిలిపి వేశారు. ఆ సమయంలో దర్శన్‌ అభిమానులు మరియు మద్దతు దారులు అక్కడ కాస్త గందరగోళం క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారందరిని అక్కడ నుండి పంపించేందుకు వెంటనే చెదరగొట్టేశారు.

లోనికి వెళ్లేందుకు దర్శన్‌ పోలీసులను రిక్వెస్ట్ చేసినా కూడా వారు ఒప్పుకోలేదు. అక్కడ మీరు కూర్చునేందుకు కనీసం కుర్చీ లేదని.. వెళ్లి మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందని పోలీసులు అన్నారు.

అప్పుడు దర్శన్ కొద్ది సమయం అలా పక్కన నిలబడి అయినా వెళ్తాను అన్నాడు. అయినా కూడా పోలీసులు ఒప్పుకోక పోవడంతో కాస్త గందరగోళం ఏర్పడింది. దర్శన్‌ వంటి స్టార్‌ హీరోను కన్నడనాట ప్రతి ఒక్కరు గుర్తు పడుతారు. పోలీసులకు కూడా ఆయన స్టార్ హీరో.. పెద్ద సెలబ్రెటీ అనే విషయం తెలుసు. అయినా కూడా ఎందుకు వారు దర్శన్ ను అనుమతించలేదు అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం లేదా పునీత్‌ కుటుంబ పెద్దలు ఈ విషయంలో ఎలా రియాక్ట్‌ అవ్వబోతున్నారా అంటూ దర్శన్‌ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. దర్శన్‌ ను అవమానించినందుకు గాను ఖచ్చితంగా పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. పోలీసులు మాత్రం పాస్ లు ఉంటేనే పంపించాలని ఉన్నతాధికారుల ఆదేశం. అందుకే తాము దర్శన్‌ ను అనుమతించలేదు అంటున్నారు.


Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News