ఇంటిలిజెంట్ ఇలానే కొనసాగితే కష్టమే

Update: 2018-02-10 16:41 GMT
మంచి కాంబినేషన్ సినిమాలంటే ఒకప్పుడు మినిమామ్ రేంజ్ లో హిట్ అయ్యేయి. మంచి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. యాక్షన్ కథలకు కరెక్ట్ గా సెట్ అయ్యే హీరో కలిస్తే రిజల్ట్ తో సంబందం లేకుండా మంచి వసూళ్లను రాబట్టేవి. కానీ ఈ రోజుల్లో పరిస్థితి అలా లేదు. సినిమా ఏ మాత్రం డిజాస్టర్ టాక్ అని తెలిసిన రెండవ షోకే కలెక్షన్స్ దారుణంగా పడిపోతున్నాయి. అయితే రీసెంట్ గా ఇంటిలిజెంట్ సినిమాకు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది.

మెగా ఫ్యామిలీ నుంచి ఈ ఇయర్ వచ్చిన వచ్చిన రెండవ హీరో డిజాస్టర్ అందుకున్నాడు. అయితే సాయి కెరీర్ లో చాలా రోజుల తరువాత అతి తక్కువ మొదటి రోజు కలెక్షన్స్ ని అందుకున్నాడు. మినిమామ్ రెండు కోట్ల షేర్లను లాగడనికి నానా తంటాలు పడ్డాడు. మినిమామ్ రేంజ్ ఉన్న హీరోలు కూడా ఈ రేంజ్ లో రాబట్టలేరేమో. ఓపెనింగ్స్ పెద్దగా అందుకోలేని ఈ సినిమా వరల్డ్ వైడ్ మొత్తంగా రూ.4కోట్ల గ్రాస్ ను అందుకింది. సినిమా మొత్తంగా థ్రియేటికల్ రైట్స్ పరంగా రూ.27 కోట్లకు అమ్ముడు పోగా..వరల్డ్ వైడ్ గా ఇంటిలిజెంట్ రూ.2 కోట్ల షేర్స్ ని అందించాడు.

వివి.వినాయక్ సినిమా అంటే మినిమామ్ 5 కోట్ల షేర్స్ అయినా ఉండాలి. కానీ అఖిల్ కంటే దారుణంగా సినిమా ఈ స్థాయిలో అందుకోవడం ఎవరు ఉహించలేకపోతున్నారు. నైజాం లో కేవలం 50 లక్షల షేర్స్ మాత్రమే వచ్చాయి. ఇక ఓవర్సీస్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అక్కడ కేవలం 20 లక్షల షేర్స్ మాత్రమే అందాయి. మరి ఇలానే కొనసాగితే బయ్యర్స్ ని ఆదుకోవడం కష్టమే.



Tags:    

Similar News