#AA20 కాస్టింగ్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌

Update: 2020-03-10 17:30 GMT
ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన అల వైకుంఠపురంలో చిత్రం తర్వాత బన్నీ చేయబోతున్న సినిమాపై సాదారణంగానే అంచనాలు భారీగా ఉంటాయి. అలాంటిది అల వైకుంఠపురంకు ముందు రంగస్థలం చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో ఎర్ర చందనం స్మగ్లర్‌ గా బన్నీ కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ చిత్రంలో కీలక పాత్రకు గాను ఇప్పటికే విజయ్‌ సేతుపతిని దర్శకుడు సుకుమార్‌ ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఫారెస్ట్‌ ఆఫీసర్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే సమయంలో జగపతిబాబు విలన్‌ గా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రంగస్థలం చిత్రంలో జగపతిబాబు అద్బుతమైన విలనిజంను కనబర్చాడు. అందుకే ఆయనతో మరోసారి సుకుమార్‌ వర్క్‌ చేయాలని భావిస్తున్నాడట.

ఈ చిత్రంలో జగపతిబాబు మాత్రమే కాకుండా కన్నడ నటుడు రాజ్‌ దీపక్‌ శెట్టి కూడా విలన్‌ గా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక హీరోయిన్‌ గా రష్మిక మందన్న ఇప్పటికే ఓకే అయ్యింది. పల్లెటూరు అమ్మాయి పాత్రలో రష్మిక మందన్న కనిపించబోతుందట. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ ఇప్పటికే ట్యూన్స్‌ మొదలు పెట్టాడు. మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసిన సుకుమార్‌ రెండవ షెడ్యూల్‌ కు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే ఏడాదిలో సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు సుకుమార్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.
Tags:    

Similar News