ఈ మద్య కాలంలో వెబ్ సిరీస్ లకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లకు విపరీతంగా డిమాండ్ పెరిగి పోతున్న విషయం తెల్సిందే. ఆ కారణం వల్లే అల్లు అరవింద్ ఆహా అంటూ ఒక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను ఆరంభించారు. అది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోతుంది అనేది మార్కెట్ వర్గాల్లో టాక్. ఆ విషయం పక్కన పెడితే ఆహా కోసం అల్లు అరవింద్ పు వెబ్ సిరీస్ లను ప్రముఖులతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఆహా ఒరిజినల్స్ పేరుతో పలు వెబ్ సిరీస్ లు ప్రస్తుతం తెరకెక్కుతున్నాయి.
ఇప్పటికే నవదీప్ తో మస్తీస్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఇప్పుడు అదే నవదీప్ తో లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో అల్లు వారు ఒక వెబ్ సిరీస్ ను నిర్మించారట. ఆ వెబ్ సిరీస్ పూర్తి అయిన తర్వాత స్క్రీన్ ప్లే ఇంకా కాన్సెప్ట్ అంతా నచ్చిన అల్లు అరవింద్ ఇది వెబ్ సిరీస్ కంటే సినిమాగా మంచి హిట్ అవుతుందనే నిర్ణయానికి వచ్చారట. దాంతో వెంటనే వెబ్ సిరీస్ ను కాస్త సినిమాగా మార్చేయమంటూ దర్శకుడు లక్ష్మీకాంత్ ను ఆదేశించాడట.
అల్లు వారి ఆదేశాలకు షాక్ అయిన లక్ష్మీకాంత్ ప్రస్తుతం ఆ పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వెబ్ సిరీస్ ను సినిమాగా మార్చడం కాస్త కష్టమైన పనే అయినా కూడా అల్లు అరవింద్ ఆదేశం అవ్వడంతో లక్ష్మీకాంత్ ప్రస్తుతం కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా మార్చే క్రమంలో మళ్లీ కొన్ని సీన్స్ ఇంకా పాటలు చిత్రీకరించాల్సి ఉందట. మొదటి సారి ఒక వెబ్ సిరీస్ ను సినిమా గా మార్చడం జరిగింది. ఇది ఒక కొత్త ట్రెండ్ అని.. అల్లు అరవింద్ కొత్త ట్రెండ్ కు తెర తీశారంటూ ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.