సాయిధరమ్ హీరోగా నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన `చిత్రలహరి` టీజర్ నేడు రామానాయుడు స్టూడియోస్ లో లాంచనంగా రిలీజైంది. టీజర్ కి సాయిధరమ్ అభిమానుల నుంచి చక్కని స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రంలో చిత్ర ఎవరు? లహరి ఎవరు? ఆ ఇద్దరి మధ్య సాయిధరమ్ పాత్ర ఏంటి? అన్నది సస్పెన్స్ అని తెలుస్తోంది. నేటి మీడియా మీట్ లో ఈ సినిమా కథకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ని దర్శకనిర్మాతలు రివీల్ చేయలేదు. అయితే ఇదో ఫీల్ గుడ్ చిత్రమని నిర్మాతలు తెలిపారు. కిషోర్ తిరుమల సెన్సిబిలిటీస్.. కామెడీ టైమింగ్ మరోసారి ఆడియెన్ కి కనెక్టవుతుందని చిత్రయూనిట్ నమ్మకం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో నివేద, కళ్యాణి మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా సాయిధరమ్ కనిపించనున్నారని, ఆ క్రమంలోనే లవ్, ఎమోషన్, కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది.
నిర్మాతలు నవీన్, రవి మాట్లాడుతూ.. టీజర్ లాంచ్ చేశాం. సోషల్ మీడియా నుంచి చక్కని స్పందన వస్తుంది . ఈ సినిమా టైటిల్ అందరికీ నచ్చింది. అందుకు తగ్గట్టే ఇది అందరికీ కనెక్టయ్యే టైటిల్. ఏప్రిల్ 12న రిలీజ్ చేస్తున్నాం. ఏప్రిల్ తొలి వారంలో ప్రీరిలీజ్ చేస్తున్నాం. అంచనాలకు తగ్గ చిత్రం అవుతుంది. సాయిదరమ్ కి హిట్ వస్తుంది అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ.. అడగ్గానే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు, సాయిధరమ్ గారికి కృతజ్ఞతలు. టీజర్ లో డైలాగులకు చక్కని స్పందన వస్తోంది. సినిమా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా అని తెలిపారు. నివేద మాట్లాడుతూ.. కథానాయికల్ని చాలా అందంగా బలంగా చూపిస్తున్నారు కిషోర్. ఈ సినిమాకి ఎంపిక చేసుకున్న దర్వకహీరోలు, నిర్మాతలకు థాంక్స్.. అని తెలిపారు.
సాయిధరమ్ మాట్లాడుతూ - 'దర్శకుడు సుకుమార్ వాయిస్ ఇచ్చినందుకు థాంక్స్. మంచి నేపథ్య సంగీతం కుదిరింది. 4 పాటలు చాలా బావున్నాయి. మంచి సినిమా ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. నిర్మాతలు యూనిట్ కి ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. కిషోర్ కథ ఎలా చెప్పాడో అంతకుమించి బాగా తీశాడు. ఔట్ పుట్ అద్భుతంగా వచ్చింది. సినిమా అందరికీ నచ్చుతుంది. సాయికార్తీక్ వర్క్ బావుంది. సునీల్ అన్నతో కలిసి నటించడం ఆనందాన్నిచ్చింది' అని తెలిపారు.