ఇంట్రెస్టింగ్‌ పుకారు... మళ్లీ కంత్రిలా కనిపించబోతున్న ఎన్టీఆర్‌?

Update: 2022-05-15 04:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం దాదాపుగా మూడున్నర నుండి నాలుగు సంవత్సరాల పాటు కేటాయించిన ఎన్టీఆర్‌ తదుపరి సినిమా కొరటాల దర్శకత్వంలో చాలా స్పీడ్ గా చేయాలని భావించాడు. కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతూ వచ్చింది. జూన్ లో ప్రారంభించాలని భావించినా మరోసారి వాయిదా వేశారంటూ ప్రచారం జరుగుతోంది.

సినిమా ప్రారంభం ఎప్పుడు అయినా కూడా వీరిద్దరి కాంబోలో ఒక మంచి బ్లాక్ బస్టర్‌ మూవీ వస్తుందనే నమ్మకం తో నందమూరి అభిమానులు ఉన్నారు. ఆ నమ్మకంను వమ్ము చేయవద్దనే పట్టుదలతో దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్‌ విషయంలో చాలా శ్రద్దగా ఉన్నాడని తెలుస్తోంది. ఇదే సమయంలో ఎన్టీఆర్‌ లుక్ విషయంలో కూడా కొరటాల శివ చాలా పట్టుదలతో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌.. కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ కాస్త ఓవర్‌ వెయిట్‌ తోనే కనిపించాడు. అయితే వీరి కాంబోలో రాబోతున్న సినిమాలో మాత్రం ఎన్టీఆర్‌ లుక్‌ చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. వయసు చిన్న వాడిగా ఎన్టీఆర్ ను చూపించడం కోసం సన్నగా మారాలని కొరటాల శివ సూచించాడు అంటూ సమాచారం అందుతోంది.

గతంలో ఎన్టీఆర్‌ యమదొంగ మరియు కంత్రి సినిమాలో చాలా సన్నగా కనిపించిన విషయం తెల్సిందే. మరీ కంత్రి సినిమాలో ఎన్టీఆర్‌ లుక్‌ ఎలా ఉంటుందో అందరికి తెల్సిందే. ఇప్పుడు మళ్లీ కంత్రి స్థాయిలో కాకున్నా కాస్త అటు ఇటుగా కంత్రి లుక్ లో కనిపించే విధంగా ఎన్టీఆర్‌ వర్కౌట్స్ ప్రారంభించాడని.. కొరటాల శివ ఎప్పుడైతే ఎన్టీఆర్‌ బరువు తగ్గుతాడో అప్పుడు షూటింగ్‌ మొదలు పెట్టాలనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌ ను ఈమద్య కాలంలో చాలా రెగ్యులర్ గా.. ప్రతి సినిమాలో కూడా అదే ఫిజిక్ మరియు వెయిట్‌ తో చూస్తూ ఉన్నాం. ఈసారి కొరటాల శివ కనుక కాస్త సన్నగా ఎన్టీఆర్‌ ను చూపిస్తే ఖచ్చితంగా నందమూరి అభిమానులు సర్‌ ప్రైజ్ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు మరియు మీడియా వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ 30 కోసం ఆయన బరువు తగ్గే విషయం పై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇక కొరటాల శివ గత చిత్రం ఆచార్య తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫలితం ఇప్పుడు ఎన్టీఆర్‌ 30 పై పడుతుంది. కనుక అభిమానులు చాలా ఆసక్తిగా ఎన్టీఆర్ 30 కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌ 31 కు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే.
Tags:    

Similar News