ఎన్టీఆర్‌ బిగ్గెస్ట్‌ ప్లాప్‌ వెనుక ఇంట్రెస్టింగ్‌ స్టోరీ

Update: 2022-05-01 04:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో బిగ్గెస్ట్‌ సక్సెస్ లు ఉన్నాయి. అంతే స్థాయిలో ప్లాప్ లు కూడా ఉన్నాయి. చిన్న వయసులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్ డిజాస్టర్ కా బాప్ వంటి సినిమాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు ప్లాప్‌ అయితే జనాలు పట్టించుకోరు. కాని భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాలు ప్లాప్‌ అయితే అవి ఎప్పటికి గుర్తుండి పోతాయి.

అలాంటి సినిమాల్లో ఒక సినిమా ఆంధ్రావాలా. పూరి జగన్నాద్‌ మంచి ఫామ్‌ లో ఉన్నాడు... ఎన్టీఆర్‌ అప్పుడే ఓ రేంజ్ స్టార్‌ డమ్‌ తో దూసుకు పోతున్నాడు. అలాంటి సమయంలో ఆంధ్రావాలా సినిమాను చేశాడు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌ రికార్డు స్థాయి జనాలతో జరిగింది. హెలికాప్టర్‌.. రైలు లో జనాలు.. ఇలా అప్పట్లో ఆంధ్రావాలా ఆడియో వేడుక గురించి ఏడాది రెండు సంవత్సరాల పాటు చర్చ జరిగింది.

ఇప్పటికి కూడా ఆంధ్రావాలా రికార్డు ను ఏ ఒక్క సినిమా కూడా భారీ ఈవెంట్‌ తో బ్రేక్‌ చేయలేక పోయింది. అలాంటి భారీ ఈవెంట్‌ నిర్వహించిన తర్వాత సినిమా ప్లాప్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్‌ ద్వి పాత్రాభినయం చేశాడు. సినిమా లో ఎన్టీఆర్‌ లుక్ విషయంలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సెకండ్‌ ఎన్టీఆర్‌ పాత్ర పై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఆ ప్లాప్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆ సినిమాకు ఎడిటర్ గా మార్తాండ్ కే వెంకటేష్‌ వ్యవహరించాడు. సినిమా ఫస్ట్‌ రషెష్ చూసిన తర్వాత నమ్మకం కలగలేదట. సినిమా లో ఎన్టీఆర్‌ పాత్ర విషయంలో మరియు కొన్ని సన్నివేశాల విషయంలో పూరి జగన్నాథ్ ను హెచ్చరించాడట. ఎన్టీఆర్‌ తో కూడా చర్చించారట. కాని ఏ ఒక్కరు పట్టించుకోలేదట.

తాజాగా ఆయన సర్కారు వారి పాట సినిమాకు ఎడిటర్ గా వ్యవహరించాడు. సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన మార్తాండ్‌ కే వెంకటేష్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలను చేశాడు.

ఎన్టీఆర్‌ ఆంద్రావాలా సినిమా విషయంలోనే కాకుండా నాగార్జున హీరోగా తెరకెక్కిన పూరి దర్శకత్వంలో రూపొందిన సూపర్ సినిమా విషయంలో కూడా మార్తాండ్‌ కే వెంకటేష్ ముందుగానే ఫలితం విషయంలో అనుమానం వ్యక్తం చేశాడట. కాని ఆయన వాదనను పట్టించుకోలేదట. కొందరు తన మాటలు విని మార్పులు చేర్పులు చేస్తే వర్కౌట్‌ అయ్యిందని చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News