ఇంటర్వ్యూ: టికెట్ రేట్ల పెంపుతో ప్రేక్షకులు థియేటర్లకి దూరమౌతున్నారు - దిల్ రాజు
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు.. ప్రస్తుతం తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో పలు ఆసక్తికరమైన చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో రూపొందిన ''ఎఫ్ 3'' సినిమా కూడా ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా ఈ మూవీ తెరకెక్కింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ ని మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దిల్ రాజు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...
'ఎఫ్ 3' ఐడియాని దర్శకుడు అనిల్ రావిపూడి మీకు ఎప్పుడు చెప్పారు?
- 'ఎఫ్ 2' విడుదలకు ముందే అనిల్ కు 'ఎఫ్ 3' ఐడియా వచ్చింది. ఎఫ్-2 పెద్ద హిట్ అయితే ఎఫ్-3 చేద్దామని చెప్పారు. మేము అనుకున్నట్లే అది పెద్ద విజయం సాధించింది. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత స్క్రిప్ట్ ని పూర్తి చేసి నటీనటులందరినీ మళ్ళీ ఒక్కదగ్గరి చేర్చి సెట్స్ పైకి వెళ్లాం. కథ చెప్పినపుడు ఎంత నవ్వుకున్నానో సినిమా చూసిన తర్వాత దానికి మించి నవ్వుకున్నాను. 'ఎఫ్ 3' నాన్ స్టాప్ ఎంటర్ టైనర్.. కంప్లీట్ ఫన్ రైడ్.
'ఎఫ్ 2' తో పోల్చుకుంటే 'ఎఫ్ 3' లో ఎలాంటి ఫన్ వుంటుంది?
- 'ఎఫ్ 2' లో ప్రేమ, పెళ్లి.. అందులో వున్న ఫస్ట్రేషన్ ని హిలేరియస్ గా చూపించి చివరికి భార్యల పాయింట్ ఆఫ్ వ్యూని కూడా చూడాలని చెప్పి అందరికీ నచ్చేలాగ హ్యుమరస్ గా చేశాం. 'ఎఫ్ 3' విషయానికి వస్తే.. భూమి, నీరు, ఆకాశం, అగ్ని, గాలి.. ఇవి పంచభూతాలు. ఇవి లేకుండా మనిషి బ్రతకలేడు. ఈ పంచభూతాలతో పాటు ఆరో భూతం డబ్బు కూడా మనిషి బ్రతకడానికి అంతే అవసరం. డబ్బు లేకుండా మనిషి బ్రతకలేడు. చిన్నది కానీ పెద్దది కానీ ప్రతి మనిషి బ్రతకడానికి డబ్బు ఈ రోజు తప్పనిసరైపోయింది. బంధాలు, బిజినెస్సులు అన్నీ డబ్బుతోనే ముడిపడి వున్నాయి. అలాంటి డబ్బు చుట్టూ తిరిగేకథ 'ఎఫ్ 3'.
అనిల్ అద్భుతంగా రాశాడు.. తీశాడు. అనిల్ లో నాకు నచ్చే అంశం కథ కంటే కథనంపై ఎక్కువ ద్రుష్టి పెడతాడు. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తున్నామా లేదా అని చూస్తాడు. 'ఎఫ్ 3' ఆర్టిస్టులకు భోనంజా లాంటింది. ఇంతమంది ఆర్టిస్ట్ లని పెట్టుకొని అద్భుతమైన ఫన్ క్రియేట్ చేశాడు అనిల్. సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాను. ప్రేక్షకుడిగా ఒకటి మాత్రం గ్యారెంటీగా చెప్పగలను. సినిమా రన్ టైం 2గంటల 28నిమిషాలు వుంటుంది. ఇందులో 90 నిమిషాలు నాన్ స్టాప్ గా నవ్వుతూనే వుంటారు. అంత ఫన్ రైడ్ గా వుంటుంది.
సినిమా టికెట్ల రేట్లని యధాతథంగా వుంచడానికి కారణం?
- పాండమిక్ తర్వాత పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. సినిమాలు ఆగిపోయి బడ్జెట్ లు పెరిగాయి. ఇదే సమయంలో ఆడియన్స్ ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. RRR - కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచి దానికి సరిపడా రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేశాం. ఇందులో మంచి ఫలితాలు కూడా సాధించాం.
- ఐతే ఇక్కడ పరిశీలించిన అంశం ఏమిటంటే.. చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి దూరమౌతున్నారు. అలాగే రిపీట్ ఆడియన్స్ తగ్గిపోయారు. అప్పర్ క్లాస్ ఓకే కానీ.. మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ మాత్రం థియేటర్ కి రావడం తగ్గిపోవడం గమనించాం. టికెట్ల ధరలు వారికి అందుబాటులో లేకపోవడం దీనికి కారణం. 'ఎఫ్ 3' అందరి కోసం తీసిన సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన సినిమా. ధరలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత జీవో ప్రకారం పాత ధరలకే టికెట్లు రేట్లని తగ్గించాం. చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ కూడా అలవాటు పడిపోయారు. వాళ్ళని కూడా థియేటర్ కి రప్పించాలనే ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం.
ధరలు తగ్గించిన దాని ప్రకారం మీ బడ్జెట్ ని రీచ్ కాగలరని భావిస్తున్నారా?
- నాకు థియేట్రికల్ రెవెన్యూ కిక్ ఇస్తుంది. ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమా చూడటంలోనే ఒక ఆనందం వుంటుంది. ఫస్ట్ డే, ఫస్ట్ వీక్.. సెకండ్ వీక్ ఇలా కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడంలోనే ఒక కిక్ వుంటుంది. 'ఎఫ్ 3' కి తప్పకుండా రిపీట్ ఆడియన్స్ వస్తారు. థియేటర్లు ఆడియన్స్ తో కళకళలాడుతాయి. ప్రేక్షకులు ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తారు.
'ఎఫ్ 3' ని పాన్ ఇండియా స్థాయిలో చేసే ఆలోచన రాలేదా?
- పాన్ ఇండియా విడుదల చేయాలంటే దానికి సెఫరేట్ గా హోం వర్క్ చేయాలి. బాలీవుడ్ లో కూడా ప్రేక్షకుడు థియేటర్ లోకి రావాలంటే స్క్రిప్ట్ దశ నుండే ప్లాన్ చేయాలి. 'ఎఫ్ 3' వరకూ మాకు పాన్ ఇండియా ఆలోచన లేదు.
మీ బ్యానర్ లో మార్వెల్ లాంటి సూపర్ హీరో సినిమాలు వచ్చే అవకాశం ఉందా?
- సినిమా మారుతూవుంది. ఎన్ని సినిమాలు చేసినా ఇప్పుడంతా లార్జన్ దెన్ లైఫ్ సినిమాలు గురించే మాట్లాడుకుంటున్నారు. మార్వెల్ అవతార్ లాంటి లార్జర్ దాన్ లైఫ్ సినిమాలే నిలబడుతున్నాయి. తెలుగులో ఈ ట్రెండ్ మొదలైయింది. రాజమౌళి గారు 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తో దీనికి శ్రీకారం చుట్టారు. మేము కూడా ఒక మూడు కథలపై పని చేస్తున్నాం. రెండేళ్ళలో ఒకటి, రెండు పెద్ద సినిమాలు మా బ్యానర్ నుండి ప్రకటించే అవకాశం వుంది.
'ఎఫ్ 3' కి టికెట్ రేట్లు తగ్గించిన నేపధ్యంలో మంచి రెస్పాన్స్ వస్తే.. మిగతా సినిమాలు కూడా ఇదే పద్దతి ఫాలో అయ్యే అవకాశం ఉందా?
- మొన్న సినిమాలు విడుదలైనప్పుడు రేట్లు పెరిగాయి. ఆ రేట్లు నేను పెంచానని విమర్శించారు. నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేశాడు కాబట్టి ఆయనే పెంచేశాడని సులువుగా అనేస్తారు. కానీ తెర వెనుక బోలెడు కథ వుంటుంది. నిర్మాతలు, హీరోలు ఇలా బోలెడు లెక్కలు వుంటాయి. అందుకే టికెట్ రేట్లు తగ్గిస్తూ మొదట నేను ఒక అడుగు వేస్తున్నా. ఇది కనుక సక్సెస్ ఐతే అందరూ ఇదే ఫాలో అవుతారు. ప్రస్తుతానికి అందరూ ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
* మల్టీ ప్లెక్స్ లో చార్జీలు ఎలా ఉండబోతున్నాయి?
- ప్రసాద్స్ - జీఎంబీ లాంటి ప్రైమ్ మల్టీప్లెక్స్ లో 250 + జీఎస్టీ.. మిగతావి జీఎస్టీ కలుపుతూ 250. హైదరాబాద్ లో సింగల్ స్క్రీన్స్ అన్నీ 150 + జీఎస్టీ.. జిల్లాల్లో జీఎస్టీ కలుపుతూ 150 ఉంటుంది. 250లో మాకు వచ్చేది 125 రూపాయిలే.
- థియేటర్ వుండటం వలన ఎదో అద్భుతమైన లాభాలు వచ్చేస్తున్నాయనే అపోహ కూడా వుంది. కర్నూల్ లో 15కోట్లు పెట్టి మల్టీప్లెక్స్ లో ఇన్వెస్ట్ చేశాం. పదేళ్ళు లీజు. పదిహేను కోట్లు వడ్డీతో సహా రిటర్న్ తెచ్చుకోవాలి. లెక్క చూసుకుంటే రూపాయికి వడ్డీ వస్తుంది. 15 కోట్ల మీద నెలకి పదిహేను లక్షలు వస్తుందని అనుకుందాం. కానీ పదేళ్ళలో ఈ పదిహేను కోట్లు పోయి జీరో అవుతుంది. దీని ప్రకారం చూసుకుంటే నష్టమే. మల్టీప్లెక్స్ అన్నిటిలో ఈ సమస్య వుంది. షేర్ మార్కెట్ కోసం కార్పోరేట్ కంపెనీలు చేస్తున్న ఒక అపోహ ఇదంతా.
- ఒక థియేటర్ల గురించి మాట్లాడేటప్పుడు 450థియేటర్ల వున్నాయి నైజాంలో. ఇందులో మా సంస్థకు 60 వున్నాయి. దిల్ రాజు నైజాం మొత్తం కంట్రోల్ పెట్టుకున్నాడని చాలా మంది అంటారు. కానీ 60 థియేటర్లతో నేను కంట్రోల్ లో పెట్టుకునేది ఏమీ వుండదు. కానీ మిగతా వాళ్ళు మా మాట ఎందుకు వింటారంటే.. ఎవరైనా రూపాయి డబ్బు మాకు అడ్వాన్స్ గా ఇస్తే సినిమా అయిపోగానే రెండు మూడు వారాల్లో వారి ఖాతా సెటిల్ చేసుకొని వెళ్ళిపోతారు. మాకు ఇచ్చిన డబ్బు అంత సేఫ్ గా వుంటుంది. ఎక్కువ సినిమాలు చేయడం వలన ఆటోమేటిక్ గా మాకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు కారణాల వల్ల మేము నెంబర్ వన్ గా వున్నా తప్పితే, ఏదో కంట్రోల్ చేసి కాదు.
ఓటీటీలు కూడా పెద్ద సినిమాలకు ముందస్తు ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాయి. దీన్ని ఎలా చూస్తారు?
- ప్రేక్షకుడు ఇలా కూడా చూస్తాడా? అని వాళ్ళు ఒక టెస్ట్ చేసుకుంటున్నారు.
'ఎఫ్ 3' లో మూడో F కి మీనింగ్ అంటే ఏం చెప్తారు?
- ఫన్, ఫస్ట్రేషన్.. బీకాజ్ ఆఫ్ ఫైనాన్స్. ( నవ్వుతూ )
'ఎఫ్ 4' వుంటుందా?
- అనిల్ మంచి ఐడియా చెప్పాడు. నెక్స్ట్ వుంటుంది.
'ఎఫ్ 3' ఐడియా వెంకటేష్ - వరుణ్ తేజ్ కి చెప్పినపుడు వారి రియాక్షన్ ఏంటి?
- 'ఎఫ్ 2' పెద్ద సక్సెస్. మళ్ళీ అదే కాంబినేషన్ లో సినిమా అంటే అందరూ ఎక్సయిట్ అయ్యారు.
మొదటిసారి మీ బ్యానర్ సీక్వెల్ చేస్తున్నారు కదా.. ఎలా అనిపించింది?
- అనిల్ రావిపూడి చాలా స్మార్ట్ గా ప్లాన్ చేశారు. 'ఎఫ్ 3' లో పాత్రలు తీసుకొని కొత్త కథని చెప్పాడు. ఓ రెండు చోట్ల 'ఎఫ్2' గుర్తుకు వస్తుంది తప్పితే మిగతా అంతా ఫ్రెష్ గా వుంటుంది. వెంకటేష్ కి రేచీకటి.. వరుణ్ కి నత్తి. ఇలా అన్నీ కొత్త ఎలిమెంట్స్ హిలేరియస్ గా చేర్చాడు.
వెంకటేష్ మీతో ఎంత సరదాగా వుంటారు. ఆయన మీకు ఇచ్చిన సర్ ప్రైజ్ ఏమైనా ఉందా?
- 'కలియుగ పాండవులు' సమయంలో నేను వెంకటేష్ గారికి ఫ్యాన్ ని. వారం రోజులు ముందు టికెట్ బుక్ చేసుకొని సుదర్శన్ లో చూశా. 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా నైజంలో విడుదల చేసినప్పుడు ఆయనతో యాక్సస్ పెరిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు# సినిమా కోసం మొదటిసారి కలిసి పని చేశాం. వెంకటేష్ గారు ఒక ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన హీరో. నిర్మాత కోసం ఎక్కువ ఆలోచిస్తారు. లొకేషన్ లో ఏదైనా వృధా అవుతుంటే తట్టుకోలేరు. రామానాయుడు గారు ఆయన నేర్పించిన గొప్ప లక్షణం అది. ఇక లొకేషన్ లో ఆయన చాలా హుషారుగా వుంటారు.