సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సర్కార్ వారి పాట చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. ఇంతకుముందు దుబాయ్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇప్పుడు హైదరాబాద్ లో 20రోజుల షెడ్యూల్ ని పూర్తి చేస్తున్నారు. కరోనా టెన్షన్స్ ఉన్నా మహేష్ రాజీ అన్నదే లేకుండా ఆన్ లొకేషన్ పని చేస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం అరవింద స్వామి- ఉపేంద్ర పేర్లు వినిపించాయి. ఆ తరవాత బాలీవుడ్ స్టార్ హీరో అనీల్ కపూర్ ని సంప్రదించగా ఆయన ఆల్మోస్ట్ ఓకే చెప్పారని కూడా ప్రచారమైంది. కానీ ఇప్పటివరకూ ఆ కీలక పాత్రకు ఎవరూ ఫైనల్ కాలేదనేది తాజా గుసగుస. ఆ ముగ్గురిలో ఎవరూ కాల్షీట్లు ఇవ్వలేకపోవడంతో టీమ్ పునరాలోచనలో పడిందట.
ఆ పాత్ర కోసం ఇప్పుడు తమిళ ట్యాలెంటెడ్ నటుడు ఆర్.మాధవన్ ని సంప్రదించారని కానీ అతడిని ఫైనల్ చేసే ముందు నిర్మాతలు డైలమాలో పడ్డారని ప్రచారమవుతోంది. ఈ డైలమాకి కారణం లేకపోలేదు. మ్యాడీ అలియాస్ మాధవన్ నటించిన ఇటీవలి తెలుగు సినిమాలేవీ సక్సెస్ కాలేదు. సవ్యసాచి- నిశ్శబ్ధం చిత్రాల్లో అతడు విలన్ గా నటిస్తే అవి రెండూ డిజాస్టర్లు గా నిలిచాయి. దీంతో మహేష్ అభిమానులు సెంటిమెంటుగా భావిస్తున్నారట. పరిశ్రమ నియమనిబంధనలు సెంటిమెంట్ ప్రకారం అతడు ఇందులో నటిస్తే మంచిది కాదని చెబుతున్నారట. మరి చిత్రబృందం చివరికి ఏం చేయనుందో వేచి చూడాలి.
ఇక సౌతిండస్ట్రీలోనే గొప్ప నటుడిగా మాధవన్ కి ఉన్న ఫాలోయింగ్ అసాధారణం. అతడి చేరికతో తమిళంలో బిజినెస్ కి పెద్ద ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మహేష్ అభిమానులు ఆందోళన తగ్గించుకుంటే మ్యాడీ సంతకం చేసే వీలుంటుందేమో!!