ఇర్ఫాన్ గురించి ప్రచారం ఆపండి

Update: 2018-03-10 10:30 GMT
బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యం గురించి గత నాలుగైదు రోజులుగా తీవ్ర ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో మీడియాలో విపరీత కథనాలు వెలువడుతున్నాయి. వ్యాధి నిర్ధారణ కాక ముందే ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు కథలు అల్లడంతో నిజాల కన్నా ఎక్కువగా పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఇర్ఫాన్ గురించి ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు ఇప్పటి దాకా మౌనంగా ఉన్నారు కాని ఆయన భార్య సుతాప సిక్దర్ ఎట్టకేలకు స్పందించారు. తన భర్త పోరాట యోధుడని పేర్కొన్న సిక్దర్ తమకు చాలా ఆపత్కాలం నడుస్తోందని, ఇర్ఫాన్ కు వచ్చిన వ్యాధి ఏంటి అనేది డాక్టర్లు ఇంకా నిర్ధారించే దిశలోనే ఉన్నారని, అప్పటిదాకా ఎవరికి తోచినట్టు వారు ఊహాగానాలు ప్రచారం చేయకండని విజ్ఞప్తి చేసారు.

ఇర్ఫాన్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాడనే నమ్మకంతోనే తాను ఇదంతా చెబుతున్నానని, కొందరు ఇర్ఫాన్ గురించి వేరే ప్రచారాలు చేయటంతో మెసేజ్ పెడుతున్నా అని క్లారిటీ ఇచ్చారు. యుద్ధంలో ఎలా గెలవాలి అనే దాని గురించి తాను ఇర్ఫాన్ పోరాడుతున్నామని ఇప్పుడు దేని గురించే ఆలోచించే వ్యవధి లేదని చెప్పిన సిక్దర్ వ్యాధి నిర్ధారణ మాత్రం జరగలేదని స్పష్టంగా చెబుతున్నారు. అమోఘమైన టాలెంట్ తో తన జీవితంలోని అన్ని గండాలను దాటిన ఇర్ఫాన్ ఇప్పుడు కూడా అదే చేస్తారని చెప్పిన సిక్దర్ అభిమానుల ఉత్సుకతను అర్థం చేసుకోగలనని కాని సమయం ఇవ్వండని కోరింది.

ఇర్ఫాన్ ఖాన్ ను చికిత్స కోసం అమెరికా తీసుకువెళ్ళే అవకాశాల గురించి గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో హోరెత్తిపోతోంది. సౌత్ సినిమాలకు ఒక రోజు ముందే రివ్యూలు ఇచ్చే దుబాయ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఇర్ఫాన్ ఇక ఆరు నెలల కంటే ఎక్కువ ఉండరని ట్వీట్ చేయటం మరింత కలకలం రేపింది. ఈయన మాటలను సీరియస్ గా తీసుకోవడానికి లేదు. డిజాస్టర్ సినిమాలు కూడా అద్భుతంగా ఉన్నాయని ఒక రోజు ముందు ట్వీట్ చేసే ఉమైర్ మాటలు లైట్ తీసుకోవచ్చు. 
Tags:    

Similar News