మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 'ఆచార్య' సినిమా థియేటర్లలోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీపై ముందు నుంచే మంచి అంచనాలున్నాయి. అందులోనూ ఇది సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన సినిమా కావడంతో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ''ఆచార్య'' సినిమాకి మొదటి రోజు మొదటి ఆటకే మిశ్రమ స్పందన వచ్చింది. చిరంజీవి - చరణ్ లను ప్లస్ పాయింట్స్ గా చెబుతూనే.. మెగా తండ్రీకొడుకులను పెట్టుకొని కాలం చెల్లిన కథ.. నీరసమైన స్క్రీన్ ప్లేతో సినిమా తీశారంటూ నెటిజన్లు కొరటాల పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
నిజానికి 'ఆచార్య' సినిమా ఓపెనింగ్ డే నాడు నాన్-ఆర్.ఆర్.ఆర్ రికార్డ్ నమోదు చేస్తుందని మెగా ఫ్యాన్స్ నిన్నమొన్నటి వరకూ బీరాలు పలుకుతూ వచ్చారు. కానీ తొలి ఆటకే నెగెటివ్ రెస్పాన్స్ రావడంతో.. రికార్డుల మాట పక్కన పెట్టి, రెండో రోజు నుండి మెగా మల్టీస్టారర్ పరిస్థితి ఏంటని ఆలోచించడం మొదలుపెట్టారని యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
'ఆచార్య' కు ఫస్ట్ డే వచ్చిన టాక్ మరియు నెగెటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కోలుకోవడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు ఏపీ/ నైజాం లలో తక్కువ ఆక్యుపెన్సీ ఇవాళ తెల్లవారుజామున కొన్ని షోలు క్యాన్సిల్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా ఈరోజు కొన్ని థియేటర్లలో 'ఆచార్య' స్థానంలో 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారట. అలానే ఏపీలో వినుకొండ లోని అరుణ థియేటర్ లో ఇవాళ్టి నుంచి ఆచార్యను తీసేసి.. దాని ప్లేస్ లో RRR మూవీని వేస్తున్నారని సమాచారం.
'ఆచార్య' చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు టికెట్ రేట్లు పెంచుకునే అనుమతి ఇవ్వడంతో.. ఈ అవకాశాన్ని ఎగ్జిబిటర్స్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు. అయితే పెరిగిన టికెట్ ధరల దృష్ట్యా, రెండో రోజు చాలా ఏరియాల్లో ఆక్యుపెన్సీ సగానికి పడిపోయిదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో 'ఆచార్య' టిక్కెట్ ధరలు తగ్గించారు.
సింగిల్ స్క్రీన్లలో మొదటి రోజు టికెట్ రేటు రూ. 175 ఉంటే.. రెండో రోజు రూ. 150 గా ఉంది. ఏదేమైనా ఈ వీకెండ్ లో ఏదైనా మ్యూజిక్ జరగకపోతే మెగా మూవీ కోలుకోవడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సినిమా రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఏ మేర ప్రభావం చూపుతుందో చూడాలి.
కాగా, 'ఆచార్య' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. తిరు సినిమాటోగ్రఫీ అందించారు. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేశారు.