'ఆచార్య' సీడెడ్‌ ఇష్యూ తీరిన‌ట్టేనా?

Update: 2022-07-18 17:26 GMT
మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల తొలి క‌ల‌యిక‌లో స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన `ఆచార్య‌` గ‌త కొన్ని రోజులుగా వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్లు భారీ స్థాయిలో న‌ష్టాల‌ని చ‌విచూశారు. ఈ న‌ష్టాల‌ని తిరిగి చెల్లించాల‌ని గ‌త కొన్ని రోజులుగా హీరోలు చిరంజీవి, రామ్ చ‌రణ్ ల‌తో పాటు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

చిరు, చ‌ర‌ణ్ క‌లిసి 24 కోట్ల వ‌ర‌కు తిరిగి చెల్లించార‌ని వార్త‌లు వినిపిస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకొన్ని ఏరియాల‌కు సంబంధించిన డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు న‌ష్టాల‌ని తిరిగి చెల్లించ‌లేద‌ని చిత్ర బృందాన్ని నిల‌దీస్తున్నారు. గ‌త వారం సీడెడ్ కు చెందిన డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కార్యాల‌యానికి వెళ్లి న‌ష్టాలపై నిదీశారట‌. అంతే కాకుండా త‌మ‌కు ఏర్ప‌డిన న‌ష్టాల‌ని తిరిగి చెల్లించాల్సిందే అంటూ కొర‌టాల‌ని డిమాండ్ చేశార‌ట‌.

ఇప్ప‌టికే కొన్ని ఏరియాల‌కు సంబంధించిన డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు కొర‌టాల తో పాటు చిత్ర బృందం కొంత మేర డ‌బ్బులు తిరిగి చెల్లించ‌డంతో కొంత వ‌ర‌కు స‌మ‌స్య ప‌రిష్కారం అయింద‌ని తెలిసింది. `ఆచార్య‌`కు సీడెడ్ ఏరియాలో భారీగా న‌ష్టాలు వ‌చ్చాయ‌ట‌.

అయితే దీని సెటిల్ మెంట్ ని 4.75 కోట్లకు సెటిల్ చేశార‌ట‌. ఈ మొత్తాన్ని నెల రోజుల్లో తిరిగి ఇస్తాన‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కీల‌క డాక్యుమెంట్ల‌ని సిద్ధం చేయించి హామీ ఇచ్చార‌ట‌. దీంతో సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్లు శాంతించి తిరిగి వెళ్లిన‌ట్టుగా తెలుస్తోంది.    

అంతే కాకుండా ఆచార్య న‌ష్టాల‌ని తీర్చ‌డానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు. అయితే దీనికి అయ్యే జీఎస్టీని దాదాపు 10 కోట్ల‌ని తాను భ‌రిస్తాన‌ని నిర్మాత నిరంజ‌న్ రెడ్డి హామీ ఇచ్చార‌ట‌. సినిమా రిలీజ్ స‌మ‌యంలో డిస్ట్రిబ్యూష‌న్ బాధ్య‌త‌ల్ని కొర‌టాల శివ తీసుకున్నారట‌. ఆ న‌ష్టాల‌ని తానే తీర్చ‌నున్నార‌ని, అందు లో భాగంగానే సీడెడ్ డిస్ట్రీబ్యూట‌ర్ల‌కు హామీ ఇచ్చాడ‌ని చెబుతున్నారు.

ఇదిలా వుంటే కొర‌టాల శివ త‌న‌ త‌దుప‌రి సినిమాగా ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్ ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. `ఆచార్య‌` ఇష్యూ కార‌ణంగా ఫైన‌ల్ స్క్రిప్ట్ ని పూర్తి చేయ‌లేక‌పోయాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వ‌ర్క్ జ‌రుగుతోంది. ఫైన‌ల్ స్క్రిప్ట్ ని లాక్ చేయాల‌ని ఎన్టీఆర్ కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌ట‌. స్క్రిప్ట్ ఫైన‌ల్ అయితే రెగ్యుల‌ర్ షూటింగ్ ని ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.
Tags:    

Similar News