యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ''ఆదిపురుష్''. రామాయణం ఇతిహాసం ఆధారంగా ఈ పౌరాణిక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే రామాయణం మీద అనేక సినిమాలు తెరకెక్కగా.. ఇప్పుడు ఈ మూవీలో కొత్తగా ఏం చూపిస్తారని మొదటి నుంచీ ఆడియన్స్ లో సందేహాలు ఉన్నాయి. అయితే మోషన్ క్యాప్చర్ పిక్చర్ టెక్నాలజీతో తీయడమే ప్రత్యేకతగా మేకర్స్ పేర్కొన్నారు.
దీంతో 'ఆదిపురుష్' కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని భావించగా.. ఇటీవల వచ్చిన టీజర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రియల్ యాక్షన్ ఎపిక్ డ్రామాని చూపిస్తారని అనుకుంటే.. పేలవమైన వీఎఫ్ఎక్స్ - గ్రాఫిక్స్ తో కార్టూన్ లేదా యానిమేషన్ చిత్రాన్ని అందిస్తున్నారని సినీ ప్రేమికులు ట్రోల్ చేసారు. అంతేకాదు రాముడు - రావణుడు - హనుమంతుడు పాత్రల చిత్రణపైనా అభ్యంతరాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' చిత్రాన్ని సంక్రాంతి నుంచి మరో ఐదు నెలలు వాయిదా వేశారు. అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడం కోసం టీమ్ కు మరికొంత సమయం అవసరం అవుతోందని పేర్కొన్నారు. టీజర్ కి అన్ని వర్గాల నుండి విమర్శలు రావడంతో.. సినిమాలో కొన్ని కీలక మార్పులు చేసి విమర్శకులని శాంతిపజేయాలని మేకర్స్ భావించి పోస్ట్ పోన్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
'ఆదిపురుష్' లో రావణ్ గా కనిపించనున్న సైఫ్ అలీ ఖాన్ గెటప్ మరియు హనుమంతుడి లుక్ పై ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయి. రావణుడికి గడ్డం పెట్టి టర్కిష్ నిరంకుశుడిలా చూపించారన.. అలానే హనుమాన్ లెదర్ జాకెట్ ధరించినట్లుగా కనిపించిందని ఆరోపించారు. హిందువుల మనోభావాలను నమ్మకాలను దెబ్బ తీసేలా ఈ పాత్రల చిత్రణ ఉందని హిందుత్వ వాదులు మరియు పలువురు రాజకీయ నాయకులు పండిపడ్డారు.
అయితే తాజా నివేదికల ప్రకారం, 'ఆదిపురుష్' లో రావణ్ లుక్ కి మేకోవర్ ఇవ్వడానికి ఓం రౌత్ అండ్ టీమ్ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. దీని కోసం సైఫ్ అలీఖాన్ తో రీషూట్స్ చేస్తారని రూమర్స్ వచ్చాయి. కాకపోతే రావణ్ పాత్రకు సంబంధించిన అన్ని భాగాలను రీషూట్ చేయడం అంత తేలికైన పని కాదు. దీనికి అదనంగా భారీ బడ్జెట్ ఖర్చవ్వడమే కాదు.. చాలా ఎక్కువ సమయం పడుతుంది.
ఈ నేపథ్యంలో సైఫ్ గడ్డం తొలగించడానికి మేకర్స్ VFX టీమ్ పై ఆధారపడుతున్నట్లు మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. దీంతో రీషూట్ చేస్తారా? VFX తో మ్యానేజ్ చేస్తారా? అని అభిమానుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడుతోంది. ఏమి చేసైనా సరే అనుకున్న సమయానికి విడుదలయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసారి అవుట్ ఫుట్ పై ఎలాంటి ట్రోలింగ్ రాకుండా మరింత శ్రద్ద వహించాలని కోరుతున్నారు.
ఏదేమైనా 'ఆదిపురుష్' ని వాయిదా వేయడం.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై టీం అంతా మళ్ళీ కూర్చోవడం వల్ల భారీగానే ఖర్చు అవుతుంది. ఇప్పటికే బాలీవుడ్ సంస్థ టీ-సిరీస్ ఈ సినిమాకు 450 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదనంగా మరో 100 కోట్ల వరకూ అవుతుందని అంటున్నారు. భారతదేశం గర్వించదగ్గ సినిమా చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని పేరొన్న మేకర్స్.. చివరగా ఎలాంటి అద్భుతాన్ని తెర మీద ఆవిష్కరిస్తారో వేచి చూడాలి.
''ఆదిపురుష్'' చిత్రాన్ని 3డీ - ఐమాక్స్ ఫార్మాట్ లలో 2023 జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇందులో రాముడిగా ప్రభాస్.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించనున్నారు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.