సుప్రీం హీరో చిరంజీవి.. నందమూరి యువరత్న బాలకృష్ణ సరసన 90లలొ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు విజయశాంతి. నాటి రోజుల్లో అగ్ర హీరోయిన్ గా రాజ్యమేలారు. కాలక్రమంలో లేడీ ఓరియెంటెడ్ కథలతో యాక్షన్ హీరోయిన్ గానూ రూపాంతరం చెందడంతో తనని తెలుగు ప్రేక్షకులు `లేడీ అమితాబ్` అంటూ పిలవడం ప్రారంభించారు. అందుకు తగ్గట్టే లేడీ బాస్ - మగరాయుడు లాంటి ఎన్నో యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో విజయశాంతి నటించారు. ఇక దర్శకరత్న దాసరి తనని రాములమ్మగా సరికొత్త కోణంలో ఆవిష్కరించారు.
అయితే ఇన్నిరకాల విలక్షణాలు నేటితరంలో ఎవరికి ఉన్నాయి? అంతగా ప్రయోగాత్మక పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు? అన్నది వెతికితే నిస్సందేహంగా ఆలియా భట్ పేరును సూచిస్తున్నారు అభిమానులు. అంతేకాదు...తనని లేడీ అమితాబ్ అంటూ కీర్తించేస్తున్నట్టు ఆలియానే స్వయంగా వెల్లడించింది. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తరహా గట్స్ ని ఆలియా చూపిస్తోందని కీర్తినందుకుంటోంది. ఇక అమితాబ్ తరహాలోనే పవర్ ఫుల్ పాత్రలతో లేడీ అమితాబ్ గా మారిన విజయశాంతికి ఇప్పటివరకూ ఆ బిరుదు అలానే తన పేరిట ఉంది. ఇప్పుడు దానిని ఆలియా కైవశం చేసుకుందని భావించాలి.
భారతదేశంలోనే వరుస పాన్ ఇండియా చిత్రాలతో ప్రయోగాత్మక పాత్రలతో ఏ ఇతర అగ్ర నాయికతో అయినా పోటీపడగల సత్తా తనకు ఉందని నిరూపిస్తోంది ఆలియా. ఈ భామ నటించిన ఆర్.ఆర్.ఆర్ తో పాటు గంగూభాయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తొలిగా గంగూబాయి కతియావాడి విడుదల కోసం ఆలియా ఎదురుచూస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆలియా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ప్రమోషనల్ ఈవెంట్ లో ఆలియా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
గంగూబాయి తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించిన అత్యంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ లలో ఒకటి. కమర్షియల్ ప్రేక్షకులను మెప్పించేలా సినిమా కంటెంట్ వినోదాత్మకంగా ఉండాలని పేర్కొంది. కాబట్టి ఆమె అదే సమయంలో ప్రయోగాత్మక పాత్రలో ఒదిగి నటించానని అందులోనే ఎంటర్ టైన్ మెంట్ ని ఇవ్వగలిగానని ఆలియా చెబుతోంది. ప్రజలు తనను ఇప్పుడు `4 అడుగుల అమితాబ్` అని `లేడీ అమితాబ్` అని పిలుస్తున్నారని అలియా తెలిపింది. ఇది నిజంగా ఒక గొప్ప అభినందన. ప్రజలు తనను అమితాబ్ తో పోల్చినప్పుడు అలియా తెగ ఉప్పొంగిపోతోంది. ఏది ఏమైనా కానీ విజయశాంతి నుంచి ఆ బిరుదును ఆలియా గుంజుకుంటోందన్నమాట.
గంగూభాయికి ఠఫ్ పోటీ..
ఓవైపు తమిళం నుంచి వలీమై.. మరోవైపు టాలీవుడ్ నుంచి భీమ్లా నాయక్ గంగూభాయికి తీవ్రమైన పోటీగా మారడం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ నుంచి భన్సాలీ తెరకెక్కించిన గంగూభాయి కతియావాడీ ఇద్దరు అగ్ర హీరోల సినిమాలతో పోటీకి దిగుతోంది. ఎన్నడూ లేనిది భీమ్లా నాయక్ ని తెలుగుతో పాటు హిందీలోనూ భారీగా విడుదల చేస్తున్నారు. అక్కడ రిలీజ్ చేయాలన్న ఆలోచన ఒక ప్రయోగం. రెండు వేర్వేరు చిత్ర పరిశ్రమలకు చెందిన పెద్ద సినిమాలు ఆలియా సినిమాతో పోటీపడుతుండడం విశేషం. భీమ్లా నాయక్ ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన వాలిమై ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలవుతోంది. అంటే చెన్నయ్- హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో వలీమై నుంచి గట్టి పోటీ ఇతర చిత్రాలకు ఎదురవుతోంది.
అలాగే భీమ్లా నాయక్ - ఫిబ్రవరి 25న అంటే తాను వచ్చే అదే రోజున అలియా భట్ గంగూబాయి కతియావాడి వస్తోంది. ఏది ఏమైనా భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రారంభాన్ని పొందుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రం మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు. అడ్వాన్స్ టికెటింగ్ లో అమెరికా ఓవర్సీస్ లోనూ సన్నివేశం బావుంది. ఇలాంటి పరిస్థితిలో ఆలియా నటించిన గంగూభాయి సౌత్ లో ఏ మేరకు రాణిస్తుంది? అన్నది వేచి చూడాలి.