స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏడాది గ్యాప్ తీసుకున్న తర్వాత ఎట్టకేలకు ఈ నెల 24 నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ లో అడుగు పెట్టబోతున్నాడు. ఇటీవలే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టేశారు. ఎన్నడూ లేనిది ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్ కి కమిట్ అయ్యి తన పుట్టిన రోజు నాడు అందరిని సర్ప్రైజ్ చేశాడు బన్నీ.
అయితే ఇంకా వాటి తాలుకు సరైన అప్ డేట్స్ రాకుండానే సుకుమార్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ మీద సోషల్ మీడియాలో అప్పుడే కాపీ మరకలు పడటం స్టార్ట్ అయిపోయింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఐకాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన ఈ మూవీకి రెండేళ్ల క్రితం ఫిలిప్పైన్స్ లో వచ్చిన కిటకిట అనే సినిమా నుంచి స్ఫూర్తి పొందారట
కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఇది అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో చేసే కాన్సెప్ట్ లా అనిపించదు. అనుకోకుండా తాత్కాలికంగా కళ్ళు పోగొట్టుకున్న హీరోయిన్ హీరో కోసం వెతికే క్రమంలో ఎన్నో సంఘటనలు ఎదురుకుంటుంది. అప్పుడే ఇద్దరు కలిసి ప్రయాణం చేయడం మొదలుపెడతారు. అక్కడ నేటివిటీకి తగ్గట్టు ఇందులో చాలా డ్రామా జోడించారు. మనదగ్గర మాత్రం చాలా మార్పులే చేయాల్సి ఉంటుంది.
మరి నిజంగా వేణు శ్రీరామ్ స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్నాడా లేక ఇది జస్ట్ గాసిప్పా అనేది తెలియాల్సి ఉంది. చిన్న సీన్ ని బట్టే దాని ఒరిజినల్ ఏ భాషలో ఉందొ పసిగడుతున్న టెక్నాలజీ ప్రపంచంలో దర్శక రచయితలు చాలా అలెర్ట్ గా ఉండాలి. లేదంటే ఇదుగో ఇలాంటి వార్తలకు రెక్కలు వచ్చేస్తాయి