2011లో 'ఓ మై ఫ్రెండ్' చిత్రంతో దర్శకుడిగా పరిచయయ్యాడు వేణు శ్రీరామ్. తొలి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో రెండో చిత్రానికి చాలా గ్యాప్ వచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత నాని తో 'MCA' (మిడిల్ క్లాస్ అమ్మాయి) సినిమా చేసి మంచి హిట్టు కొట్టాడు. సక్సెస్ అందుకున్నా డైరెక్టర్ కు ఈసారి కూడా గ్యాప్ వచ్చింది.
ఆ మధ్య అల్లు అర్జున్ హీరోగా 'ఐకాన్: కనబడుటలేదు' అనే సినిమాని ప్రకటించారు కానీ.. సెట్స్ మీదకు రాకముందే హోల్డ్ లో పడింది. అయితేనేం కేవలం రెండు సినిమాల అనుభవంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అందులోనూ ఇది పవన్ కంబ్యాక్ మూవీ.
'పింక్' రీమేక్ గా తెరకెక్కించిన ''వకీల్ సాబ్'' సినిమా వేణు శ్రీరామ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. వసూళ్ళు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూపించిన విధానానికి ఫ్యాన్స్ అందరూ దర్శకుడిని మెచ్చుకున్నారు. అయినప్పటికీ ఈసారి కూడా గ్యాప్ వచ్చింది.
'వకీల్ సాబ్' సినిమా వచ్చి నెలలు గడిచి పోతున్నా ఇంతవరకు వేణు శ్రీరామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ తో మూవీ చేసి కూడా ఖాళీగా ఉండటమేంటని అందరూ ఆశ్చర్యపోయారు.
నిజానికి అప్పట్లో ఆగిపోయిన 'ఐకాన్' చిత్రాన్ని తిరిగి బన్నీ తో సెట్స్ మీదకు తీసుకురావాలని ప్రయత్నాలు చేసారు. వేణు శ్రీరామ్ సైతం పలు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని వెల్లడించారు. వేణు తో తన కాంపౌండ్ లోనే సినిమాలు చేస్తున్న నిర్మాత దిల్ రాజు కూడా స్పష్టం చేశారు.
అయితే 'ఐకాన్' కోసం ఎదురు చూసిన దర్శక నిర్మాతలకు నిరాశే ఎదురైనట్లు టాక్. 'పుష్ప' తర్వాత అమాంతం క్రేజ్ పెరగడంతో.. అల్లు అర్జున్ ఆలోచనలో మార్పు వచ్చిందని.. టైర్-2 డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు మరో మెగా హీరోతో సంప్రదింపులు జరిపినట్లు రూమర్స్ వినిపించాయి. అయితే వేణు శ్రీరామ్ ఆశించినట్లు ఏదీ జరగలేదని తెలుస్తోంది. మెగా క్యాంపుపై ఆశలు వదులుకొని.. ఇప్పుడు అక్కినేని కాంపౌండ్ కు షిప్ట్ అవుతున్నాడని టాక్ వినిపిస్తోంది
యూత్ కింగ్ అఖిల్ అక్కినేనితో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేసినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే యువ హీరోకి చెప్పిన లైన్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. అంతేకాదు అఖిల్ సినిమాకు 'తమ్ముడు' అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
ఒకవేళ ఇదే నిజమైతే 'ఐకాన్' పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ సినిమా కోసం వేణు శ్రీరామ్ చాలా కాలం వర్క్ చేశారు. దిల్ రాజు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి కొన్నాళ్ళు వేచి చూసి అది ఎప్పటికైనా బన్నీ తో చేస్తారా? వేరే హీరోతో ముందుకు వెళ్తారా? లేదా పూర్తిగా పక్కన పెట్టేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.