బ‌న్నీని మ‌రో రోలెక్స్ గా చూపించ‌బోతున్నారా?

Update: 2023-01-12 05:29 GMT
కోవిడ్ త‌రువాత యావ‌త్ సినీ ప్ర‌పంచ‌మే కొత్త పుంత‌లు తొక్కుతోంది. ప్ర‌తీ స్టార్ కూడా ఏదో సినిమా చేసేశాం నాలుగు కోట్లు వెన‌కేసుకున్నాం అన్న‌ట్టుగా సినిమాలు చేయ‌డం లేదు. సినిమా చేస్తే పాన్ ఇండియా ద‌ద్ద‌రిల్లిపోవాలా? అనే మైండ్ సెట్ తో సినిమాలు చేస్తున్నారు. అంతే కాకుండా ప్ర‌తీ విష‌యంలోనూ కేర్ తీసుకుంటున్నారు. క్యారెక్ట‌ర్ ప‌రంగానూ ప్రాధాన్య‌త పీక్స్ లో వుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

అలాంటి క‌థ ఎవ‌రు చెప్పినా స‌రే న‌చ్చితే వెంట‌నే ప‌ట్టాలెక్కించేస్తున్నారు. న‌చ్చిన క‌థ‌, క్యారెక్ట‌ర్ తో ఎవ‌రు ఆఫ‌ర్ చేసినా స్టార్ హీరోలు సైతం వెనుకాడ‌టం లేదు. దానికి జ‌స్ట్ ఎగ్జాంపుల్ క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ 'విక్ర‌మ్‌'. లోకేష్ క‌న‌గ‌రాజ్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ మూవీలోని ఎండింగ్ లో క‌నిపించే రోలెక్స్ క్యారెక్ట‌ర్ సినిమాపై ఎంత ఇంపాక్ట్ ని క‌లిగించిందో అంద‌రికి తెలిసిందే. సూర్య ఈ క్యారెక్ట‌ర్ లో క‌నిపించి అంద‌రిని షాక్ కు గురిచేశాడు.

ఇప్పుడు దే త‌ర‌హా పాత్ర‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌నిపించ‌బోతున్నాడా? అంటే అవుననే స‌మాధానం వినిపిస్తోంది. వివిరాల్లోకి వెళితే... 'పుష్ప‌' మూవీతో బ‌న్నీ వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించడ‌మే కాకుండా పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిపోయాడు.

ఈ మూవీ సాధించిన విజ‌యాన్ని దృష్టిలో పెట్టుకుని 'పుష్ప 2' పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే సీక్వెల్ షూటింగ్ మొద‌లైంది. ఐదు రోజులు కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించిన అనంత‌రం దర్శ‌కుడు సుకుమార్ షూటింగ్ కి బ్రేకిచ్చాడు.

త్వ‌ర‌లో భారీ షెడ్యూల్ ప్రారంభం కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నా టీమ్ నుంచి మాత్రం ఇంత వ‌ర‌కు ఎలాంటి అప్ డేట్ రావ‌డం లేదు. ఇదిలా వుంటే 'విక్ర‌మ్‌'తో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న లోకేష్ క‌న‌గ‌రాజ్ త్వ‌ర‌లో విజ‌య్ హీరోగా భారీ యాక్ష‌న్ డ్రామాని తెర‌పైకి తీసుకురాబోతున్నాడు. లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమాటిక్ యూనివ‌ర్స్ నేప‌థ్యంలో సాగే ఈ మూవీ త‌రువాత ఖైదీ 2, విక్ర‌మ్ 2ని తెర‌పైకి తీసుకురాబోతున్నాడు.

ఈ రెండు సీక్వెల్స్ లో రోలెక్స్ త‌ర‌హా ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ ఒక‌టి వుంద‌ట‌. ఆ క్యారెక్ట‌ర్ కోసం అల్లు అర్జున్ ని అనుకుంటున్నాడ‌ట ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్.. ఈ రెండు సీక్వెల్స్ త‌రువాత అల్లు అర్జున్ క్యారెక్ట‌ర్ మీద‌నే ఫుల్ మూవీని కూడా ప్లాన్ చేస్తున్నాడ‌ని, ఈ విష‌యంలో హీరో అల్లు అర్జున్ తో ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News