టాలీవుడ్ లో మునుపెన్నడూ చూడని, ఊహించని క్రేజీ కాంబినేషన్ లు సెట్టవుతున్నాయి. 'ట్రిపుల్ ఆర్' లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. ఇది చాలా సర్ ప్రైజింగ్ గా అనిపించింది. ప్రేక్షకులకు ఓ కొత్త ఫీల్ ని కలిగించింది. కాంబినేషన్ కొత్త గా వుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రికార్డుల మోత మోగిస్తోంది. ఈ మూవీకి ముందు 'భీమ్లానాయక్' కూడా ఇద్దరు స్టార్ లతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీలక పాత్రలో మెయిన్ హీరోగా నటించగా రానా కీలక పాత్రలో కనిపించారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. ఇదే పంథాలో మరికొన్ని చిత్రాలు తెలుగులో రూపొందుతున్నాయి కూడా. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీతో పాటు త్వరలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ రీమేక్ మూవీలో కలిసి నటించబోతునన్న విషయం తెలిసిందే.
తమిళంలో సముద్రఖని నటించి దర్శకత్వం వహించిన 'వినోదాయ సితం' మూవీని ఆయన డైరెక్షన్ లోనే రీమేక్ చేయబోతున్నారు. త్రివిక్రమ్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ తో కలిసి పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మించబోతోంది. ఈ నేపథ్యంలో మరో క్రేజీ కాంబినేషన్ కూడా తెరపైకి రానుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అదే నందమూరి బాలకృష్ణ - మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్.
వీరిద్దరి కలయికలో అనిల్ రావిపూడి ఓ భారీ మల్టీస్టారర్ మూవీని చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా బాలకృష్ణతో సినిమా చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. అది ఇప్పటికి సెట్టయినట్టుగా చెబుతున్నారు. అయితే ఇది సోలో హీరో మూవీ కాదని, బారీ మల్టీస్టారర్ మూవీ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుందని కూడా చెబుతున్నారు.
అయితే కొంత మంది మాత్రం రవితేజ తో బాలయ్య మల్టీస్టారర్ మూవీ ఏంటీ? ..ఇది ఫేక్ న్యూస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా వున్నాయని ఓ వర్గం చెబుతోంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకె' షోలో రవితేజ పాల్గొన్న విషయం తెలిసిందే. దర్శకడు గోపీచంద్ మలినేని తో కలిసి ఈ షోలో రవితేజ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ, రవితేజల మధ్య గత కొన్నేళ్లుగా నలుగుతున్న ఓ వార్త పై ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు కూడా. దీంతో వీరిద్దరు కలిసి నటించినా ఆశ్చర్యం లేదని, బాలయ్య - రవితేజల మల్టీస్టారర్ వార్త నిజమైనా ఆశ్చర్యం లేదని మరి కొంత మంది చెబుతున్నారు. ఏది ఏమైనా అధికారికంగా అనిల్ రావిపూడి ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.