కథానాయికలు ఎవరైనా తాము నటించే సినిమాలో తమ పని వరకూ చూసుకుని తర్వాత లైట్ తీస్కుంటారు. కానీ తెలుగమ్మాయి అంజలి అలా కాదు. తాను ఒక సినిమాలో నటిస్తోంది అంటే దానిని కొనమని పలువురు పంపిణీదారులు లేదా తనకు తెలిసిన ట్రేడ్ వర్గాలకు సిఫారసు చేస్తోందట. సినిమాలో దమ్ముంది.. మీరు కొనుక్కుంటే బావుంటుందని తనకు అత్యంత సన్నిహితులు అయిన వారికి సూచిస్తోందట. అలానే తాను నటించిన తాజా చిత్రం లీసా 3డి బిజినెస్ పూర్తయిందని తెలుస్తోంది.
లీసా 3డి కథ వినండి ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాని మీరే రిలీజ్ చేయండి అంటూ షాపింగ్ మాల్, జర్నీ చిత్రాల నిర్మాతకు అంజలి సూచించిందట. కథ విన్న తర్వాత తానే నిర్మించేందుకు ముందుకొచ్చారట. వీరేష్ కాసాని సమర్పణలో ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఏపీ- తెలంగాణలో దాదాపు 400 పైగా 3డి థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తున్నామని.. ప్రతి సెంటర్ లో 3డి థియేటర్లు అందుబాటులో ఉన్నాయని నిర్మాత చెబుతున్నారు. ఈనెల 24న రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఎఫ్ ఎన్ సీసీలో ఆయన మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
రొటీన్ హారర్ చిత్రమేనా ఇది కూడా? అని ప్రశ్నిస్తే.. అన్ని సినిమాలు హారర్ కామెడీలుగా అలరించాయి. కానీ లీసా 3డిలో హారర్ తో పాటు సెంటిమెంట్ హైలైట్ గా ఉంటుంది. రెగ్యులర్ హారర్ సినిమా మాత్రం కానేకాదు. రెండున్నర గంటలు .. 3గం.ల పాటు నిడివి లేకుండా 2గం.ల పాటు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తుందని అన్నారు. 2.0 చిత్రానికి పని చేసిన అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేశారు. రోజుకు 2.5లక్షలు ఖర్చు చేసి ఖరీదైన కెమెరాల్ని చిత్రీకరణ కోసం ఉపయోగించారు. బెస్ట్ క్వాలిటీ విజువల్స్ తెరపై మైమరిపిస్తాయి అని తెలిపారు. లిసా 3డి చిత్రం రిలీజ్ గురించి తెలిసి ఆరు జిల్లాలకు వెంటనే ఓ బయ్యరు కొనుక్కున్నారు. మరుసటి రోజుకే బిజినెస్ మొత్తం పూర్తవ్వడం ఈ సినిమాకి ఉన్న డిమాండ్ ని తెలియజేస్తోంది. అంజలి ప్రధాన పాత్ర పోషించగా.. బ్రహ్మానందం తదితరులు ఈ చిత్రంలో నటించారు.
ఇది తెలుగు స్ట్రెయిట్ సినిమా. తమిళంలో అనువదించి రిలీజ్ చేస్తున్నాం. సైమల్టేనియస్ గా రెండు చోట్లా రిలీజ్ చేస్తున్నాం. ఇదివరకూ తెలుగులో పిజ్జా అనే హారర్ చిత్రాన్ని రిలీజ్ చేశాం. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెసైందో తెలిసిందే. సింగర్ల కోసం ప్రసాద్ లాబ్స్ లో షో వేస్తే అరిచి గోల పెట్టారు. మధ్యలోనే సినిమాని ఆపాల్సొచ్చింది. లీసా 3డి అంతకుమించి భయపెడుతుంది. థియేటర్లలో గగ్గోలు పెట్టడం ఖాయం. పంపిణీదారుగా.. ఎగ్జిబిటర్ గా ఎంత అనుభవంతో అన్ని పక్కా క్యాలిక్యులేషన్స్ తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాను. కింది స్థాయి నుంచి వచ్చాను కాబట్టి హిట్ సినిమాని ఇవ్వడానికి ఏం చేయాలో నాకు తెలుసు. నేను దేవుడిని కాకపోయినా హిట్ ఫార్ములా తెలిసినవాడిగా నమ్మకంగా చెబుతున్నా. గతంలో ప్రేమిస్తే.. షాపింగ్ మాల్.. జర్నీ ఎంత పెద్ద విజయం సాధించాయో అంతకుమించిన ఘనవిజయం అందుకోబోతున్నామని తెలిపారు.