పాండమిక్ తర్వాత తెలుగు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబిటర్స్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు లెక్కేస్తే అర డజను కూడా కనిపించడంలేదు.
స్టార్ క్యాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చాలా చిత్రాలు.. అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక డిజాస్టర్స్ గా నిలిచాయి. అందరికీ తీవ్ర నష్టాలను మిగిల్చాయి.
కరోనా కారణంగా ఇప్పటికే ప్రొడ్యూసర్స్ దారుణంగా నష్టపోయారని అనుకుంటుండగా.. ఇప్పుడు వరుస పరాజయాలు వారిని మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ని కంట్రోల్ అనే విషయాన్ని నిర్మాతలు తెర మీదకు తీసుకొచ్చారు
పెరిగిపోతున్న బడ్జెట్లకు అడ్డుకట్ట వేస్తే.. దానికి తగ్గట్టుగా బిజినెస్ చేసుకోవచ్చని.. అప్పుడు సినిమా ప్లాప్ అయినా నష్టాల్లో మునిగిపోయే పరిస్థితి ఉండకపోవచ్చని ఆలోచన చేస్తున్నారు. అయితే ఏ రూపంలో బడ్జెట్ ని నియంత్రించాలి అనే విషయంపైనే ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలకు పరిష్కరం చూపాలని.. ప్రొడ్యూసర్స్ గిల్డ్ మరియు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. సమావేశాల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని.. అప్పటి వరకు షూటింగులు నిలిపివేయాలని బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే.
దీని కోసం నాలుగు కమిటీలు వేశారు. అందులో ఒకటి బడ్జెట్ కంట్రోల్ మీద చర్చిస్తోంది. నిర్మాణ వ్యయం ఎలా తగ్గించాలనే విషయం మీద మల్లగుల్లాలు పడుతున్నారు. కోట్లతో కూడుకున్న సినిమా నిర్మాణంలో ఏ విధంగా వేస్టేజ్ తగ్గించాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
బడ్జెట్ నియంత్రణ అంటే ఫస్ట్ అందరూ చెప్పే అంశం 'కాస్ట్ కటింగ్'. టాలీవుడ్ లో స్టార్ హీరోల - అగ్ర దర్శకుల రెమ్యునరేషన్స్ ఎప్పుడూ బెంబేలెత్తిస్తుంటాయి. హీరోయిన్లు కూడా మేమేం తక్కువ కాదంటూ అధికంగా డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే సినిమా మార్కెట్ అంతా వాళ్ళ పేరు మీదుగానే జరుగుతుంది కాబట్టి.. పారితోషికాలు తగ్గించుకోమని అడిగే అవకాశం ఉండదు.
అశ్వినీదత్ - బండ్ల గణేష్ లాంటి సినీ ప్రముఖులు సైతం హీరోలు - డైరెక్టర్లు రెమ్యునరేషన్ తగ్గించాలనేది తప్పుడు వాదన అని పేర్కొన్న సంగతి తెలిసిందే. హీరో రేంజ్ ఎంత పెరిగితే అంత డబ్బు వస్తుందని.. కాకపోతే మనం వేస్ట్ లేకుండా అంతా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలని బండ్ల సూచించారు.
బండ్ల గణేష్ చెప్పిన దాంట్లోనూ నిజం ఉంది. కాకపోతే అగ్ర దర్శక హీరోలు రెమ్యునరేషన్స్ తీసుకోకుండా.. లాభాల్లో షేరింగ్ తీసుకుంటే కొంతమేర నిర్మాతలపై ఆర్థిక భారం పడకుండా చూసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్స్ ఇదే విధానంలో సినిమాలు చేస్తున్నారు.
అలానే ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా చేసినా భారీగా ఖర్చు చేసి ప్రమోషన్స్ చేయాల్సి వస్తోంది. జనాలను థియేటర్లకు రప్పించడానికి పబ్లిసిటీ అవసరం కాబట్టి.. ప్రచార కార్యక్రమాలు అనేవి తప్పనిసరిగా చేయాల్సిందే. కాకపోతే అది కూడా అదుపులో ఉండాలనే మాట వినిపిస్తోంది.
ఈ మధ్య స్టార్ హీరోల దగ్గర నుంచి మీడియం రేంజ్ హీరోల వరకూ.. అందరూ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం స్పెషల్ గా చార్టర్ ఫ్లెయిట్ వేసుకుని తిరుగుతుండటం మనం చూస్తున్నాం. ఫ్లయిట్ టికెట్లు వేసుకుని వెళ్తే వేలల్లో అయ్యే ఖర్చు.. లక్షల్లో అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవి నిర్మాతకు అదనపు ఖర్చుగానే భావించాలి.
అలానే వర్కింగ్ కండిషన్స్ - షూటింగ్ అవర్స్ పెంచడం - నటీనటుల కాల్ షీట్స్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం వంటి అంశాల గురించి ఆలోచిస్తే నిర్మాణ వ్యయం తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటేనే ప్రొడక్షన్ లో వేస్టేజ్ తగ్గింపు ఉంటుంది. ఇప్పుడు కమిటీ కూడా ఇదే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఆచారణసాధ్యమా కాదా అనేది వేచి చూడాలి.