మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ''గాడ్ ఫాదర్'' మంచి టాక్ తో థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ మెగా మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. ఇది మలయాళ చిత్రానికి అధికారిక రీమేక్ అనే సంగతి తెలిసిందే.
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లూసిఫర్' సినిమాకి రీమేక్ గా ''గాడ్ ఫాదర్'' తెరకెక్కింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రికి ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సూట్ అవుతుందని భావించి.. రీమేక్ రైట్స్ తీసుకున్నారు.
అయితే ఇప్పుడు చిరంజీవి కోసం చరణ్ మరో మలయాళ హిట్ మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ''భీష్మ పర్వం'' వంటి సూపర్ హిట్ చిత్రం హక్కులను కొనుగోలు చేసినట్లుగా చెప్పుకుంటున్నారు.
ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకి చిరు కూడా ఓకే చెప్పారని పుకార్లు వినిపిస్తున్నాయి. 'భీష్మ పర్వం' సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు అలాంటి మూవీ రీమేక్ హక్కులను తీసుకున్నారని అంటున్నారు.
ఇది నిజమైతే, ఆల్రెడీ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న 'లూసిఫర్' చిత్రాన్ని ''గాడ్ ఫాదర్'' గా రీమేక్ చేసినట్లే.. భీష్మ పర్వాన్ని కూడా టేకాఫ్ చేస్తారేమో చూడాలి. అయినా రీమేక్స్ అనేవి మెగాస్టార్ కు కొత్తేమీ కాదు.. ఇప్పటికే అనేక చిత్రాల్లో నటించారు.
చిరు కి స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో అనేక రీమేక్స్ ఉన్నాయి. రాజకీయాల నుంచి తిరిగొచ్చి రీఎంట్రీ కోసం 'ఖైదీ నెం.150' వంటి రీమేక్ చిత్రాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'భోళా శంకర్' సినిమా కూడా తమిళ్ లో ఘనవిజయం సాధించిన 'వేదాళమ్' కు రీమేక్ అనే సంగతి తెలిసిందే.
రీమేక్స్ అంటే చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదని.. అసలు నటుడికి నిజమైన ఛాలెంజ్ ఇచ్చేవి అవే అని చిరంజీవి ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే మెగాస్టార్ మొదటి నుంచీ రీమేక్స్ తోనే అనేక హిట్స్ - సూపర్ హిట్స్ - బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.
ఇప్పుడు 'గాడ్ ఫాదర్' ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న 'వేదాళం' రీమేక్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇదే క్రమంలో చిరంజీవి 'భీష్మ పర్వం' రీమేక్ లో భాగమవుతారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.