మెగాస్టార్ చిరంజీవి కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. చిరు నటించిన 'గాడ్ పాదర్' లో సల్మాన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడం సినిమా స్థాయినే మార్చేసింది. హిందీ సక్సెస్ లో సల్మాన్ ఎంట్రీ కీలక పాత్ర పోసించిందన్నది వాస్తవం. ఈ సినిమా కోసం సల్మాన్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా పనిచేసారు.
అందంతా కేవలం మెగాస్టార్ పై అభిమానం..రామ్ చరణ్ ప్రేమతోనే సాధ్యమైంది. మెగా ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్ కున్న బాండింగ్ కారణంగానే ఇదంతా జరిగింది. ఆరకంగా గాడ్ ఫాదర్ లో సల్మాన్ కీలక భాగస్వామిగా మారారు. మరి ఈ రుణం చిరంజీవి ఎలా తీర్చుకోగలరు? అంటే అందుకు చరణ్ ఏదో రూపంలో సహకారంగా నిలుస్తాడని చిరు మాటల సందర్భల్లో చెప్పకనే చెప్పారు.
కానీ అంతకు ముందే రుణం తీర్చుకునే అవకాశం స్వయంగా చిరంజీవికే రానుందని తెలుస్తోంది. ఈ విషయంలో సల్మాన్ ఖాన్ వద్దన్నా? చిరంజీవి తగ్గరని.. దగ్గరురుండి చిరు తన బాధ్యతగా పీలై సల్మాన్ బాకీ తీర్చేసే అవకాశం ఇప్పుడొచ్చింది. సల్మాన్ హీరోగా నటిస్తోన్న 'టైగర్ -3' హిందీతో పాటు.. తెలుగు..తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
సాధారణంగా సల్మాన్ ప్రతీ సినిమా ఈ భాషల్లో రిలీజ్ అవుతుంది. అయితే పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని 'టైగర్ -3'ని భారీ స్పాన్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో సినిమా తెలుగు వెర్షన్ ప్రమోషన్ కోసం చిరంజీవి నేరుగా రంగంలోకి దిగేసే అవకాశం కనిపిస్తుంది. దీపావళి సందర్భంగా సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాని హైదరాబాద్ సహా చెన్నైలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వీటికి మెగాస్టార్ తప్పక హాజరయ్యే అవకాశం ఉందని గెసెస్ వినిపిస్తున్నాయి. సినిమాకి సంబంధించి తెలుగు వెర్షన్ ఎన్ని ప్రెస్ మీట్ లు నిర్వహించినా మెగాస్టార్ రెక్కలు కట్టుకుని వాలిపోవడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ అడగకుండానే చిరంజీవి తన బాధ్యతగా ఫీలై ప్రచారానికి సహకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
చిరంజీవి సమర్పకుడిగా 'టైగర్ 3' రిలీజ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటీవలే మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' తెలుగు వెర్షన్ సమర్పకుడిగా చిరంజీవి వ్యవహరించారు. అమీర్ అడగగానే చిరు మరో మాట లే కుండా యస్ చెప్పి ముందుకొచ్చారు. ఆ తర్వాత సినిమా ప్రచారం కోసం ఎంతో విలువైన సమయాన్ని కేటాయించారు. అలాంటి చిరు తమ్మడు లాంటి స్నేహితుడు సల్మాన్ కోసం ఇంకెంత చేస్తారో చెప్పాల్సిన పనిలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం సీన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.