భళ్లాలుడిగా రానా నటనకు జేజేలు పలికిన వారిలో యువతులే ఎక్కువ. మగువల మనసుల్లో మారాజుగా ఇప్పటికీ గొప్ప స్థానం కలిగి ఉన్నాడు రానా. ఇంతకీ రానా పెళ్లెప్పుడు? అని కలవరించిన వాళ్లలో లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. ఇన్నాళ్ల బ్యాచిలర్ లైఫ్ కి చెక్ పెట్టేస్తూ తాను ప్రేమించిన మిహీక బజాజ్ ని పెళ్లాడేస్తున్నాడు. బంగారు వజ్రాభరణాల వ్యాపారం.. ఈవెంట్ మ్యానేజ్ మెంట్ కంపెనీ నిర్వాహణలో ఎంతో బిజీగా ఉండే మిహీక విక్టరీ వెంకటేష్ కుమార్తెకు క్లోజ్ ఫ్రెండ్. ఆ క్రమంలోనే రానాకు సన్నిహితమయ్యారు. అటుపై చాలా కాలం స్నేహం తర్వాత ప్రేమ మొగ్గ తొడిగిన సంగతిని రానానే వెల్లడించాడు.
రానా దగ్గుబాటి- మిహీక బజాజ్ వివాహం ఆగస్టు 8న హైదరాబాద్ లో జరగనుంది. ఈ వేడుకకు కొద్దిమంది బంధుమిత్రులు హాజరు కానున్నారు. వివాహానికి ముందు ఉత్సవాలు గత రెండ్రోజులుగా ప్రారంభమయ్యాయి. ఇరు కుటుంబాలు వరుసగా పెళ్లికొడుకుని చేసే ఉత్సవం.. మాతా కి చౌకి వేడుకలు జరిగాయి.
పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె నివాసాలు బిగ్ డే కోసం అలంకరణలతో దివ్యమైన కాంతులతో శోభిల్లుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ లోని రామానాడు స్టూడియోస్ కూడా రంగురంగుల డిజైనర్ క్లాత్ తో అలంకరణతో ఎంతో వైభవంగా కనిపిస్తోంది. నిత్యం ఇక్కడ అద్భుతమైన లైటింగుతో అలంకరించబడి పెళ్లికి సిద్ధంగా ఉంది. అసలు వెన్యూ ఏది? పెళ్లి వేడుక స్టూడియోలో జరగాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో వేదిక మార్పు కూడా ఉండవచ్చనేది తాజా సమాచారం.