స్టార్ డైరెక్టర్ సుకుమార్ 'పుష్ప' మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ ల సరసన చేరిపోయారు. అల్లు అర్జున్ తో తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రికార్డులు సృష్టించడమే కాకుండా ఉత్తరాది ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. బాలీవుడ్ మార్కెట్ లో ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ నేఫథ్యంలో 'పుష్ప2'ని మరిన్ని ప్రత్యేకతలతో దర్శకుడు సుకుమార్ తెరపైకి తీసుకొస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టారు కూడా.
ఐదు రోజుల షూటింగ్ తరువాత మళ్లీ బ్రేకిచ్చారు. జనవరి ఫస్ట్ వీక్ నుంచి ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ప్రారంభిం కానున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత అత్యంత భారీ స్థాయిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ భారీ హిస్టారికల్ పీరియాడిక్ మూవీని తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. బన్నీ స్నేహితుడు కేదార్ సెలగంశెట్టి ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్ట్ తో నిర్మాణ రంగంలోకి ప్రవేశించాలనుకున్నారు.
తెలంగాణలో ఖాసీంరజ్వీ రజాకార్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ సాయుధ పోరాటం నేపథ్యంలో చరిత్రాత్మక నేపథ్యంలో ఈ మూవీని తెరపైకి తీసుకురావాలనుకున్నారు. ఇందు కోసం రైతాంగ సాయుధ పోరాటం నేపథ్యానికి సంబంధించిన పలు పుస్తకాలని సుకుమార్ చదివారట. వాటి ఆధారంగానే విజయ్ దేవరకొండ తో చేయబోతున్న సినిమాకు స్క్రిప్ట్ ని అనుకున్నారట. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క అడుగు కూడా పడలేదు.
సుకుమార్ 'పుష్ప 2' షూటింగ్ లో బిజీగా వుండటం వల్ల ఈ ప్రాజెక్ట్ ఎప్పటికప్పుడు లేట్ అవుతూ వస్తోంది. విజయ్ దేవరకొండ కూడా ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా వుండం కూడా ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కావడానికి కారణంగా మారింది.
'పుష్ప 2' షూట్ ఆలస్యం అవుతుండటం.. దీని తరువాత సుకుమార్ .. రామ్ చరణ్ తో మరో క్రేజీ సినిమాకు రెడీ అవుతుండటంతో విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.
2024 వరకు కూడా సుకుమార్ ఖాళీగా లేకపోవడంతో విజయ్ దేవరకొండ సినిమా వుంటుందన్నది కలే అని ఇన్ సైడ్ టాక్. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ కూడా 'ఖుషీ' అండర్ ప్రొడక్షన్ లో వుండగానే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అంతే కాకుండా మరి కొన్ని ప్రాజెక్ట్ లని కూడా వచ్చే ఏడాది ప్రారంభంలో విజయ్ దేవరకొండ ప్రకటించబోతున్నాడని, దీంతో సుకుమార్ ప్రాజెక్ట్ లేనట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.