ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. స్వాతంత్ర్యానికి ముందు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు - కొమరం భీమ్ జీవిత కథలను ఎంచుకొని సినిమాగా మలుస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే 90శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ పడి షూటింగ్స్ నిలిచిపోవడంతో ఆగిపోయింది. ఈ సినిమాను రాజమౌళి ఎంతో పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తుండగా, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. వీరిద్దరి కలయికలో వస్తున్న పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ కావడంతో సినీ అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్ నటిస్తుండగా రాంచరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలియా భట్ ఈ సినిమాతోనే టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలో గ్రాండ్ డెబ్యూ చేయనుంది. ప్రస్తుతం ఉన్నటువంటి బాలీవుడ్ బిజీ హీరోయిన్లలో అలియా భట్ ముందు వరుసలో ఉంటుంది.
ఆమె చేతిలో ప్రస్తుతం అన్నీ బడా ప్రాజెక్టులే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి ప్రాజెక్ట్‌కి పక్కా ప్లానింగ్‌తో డేట్స్ సెట్ చేసుకుంటున్న అలియా భట్.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయడానికి తంటాలు పడుతుందట. కరోనా కారణంగా వాయిదా పడిన షెడ్యూల్ త్వరలోనే రాజమౌళి స్టార్ట్ చేయనున్నాడు. ఆల్రెడీ సగం పార్ట్ షూటింగ్ పూర్తి చేసిన అలియా ఈసారి షెడ్యూల్ తో ఆర్ఆర్ఆర్ సీతగా పూర్తి షూటింగ్ కంప్లీట్ అవుతుందని టాక్. కానీ అమ్మడు ఆర్ఆర్ఆర్ తో పాటు బాలీవుడ్ గంగుబాయ్ కతీయవాడి మూవీ చేస్తోంది. ఆ సినిమాను స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అలియా ఆర్ఆర్ఆర్ సినిమాకు డేట్స్ కేటాయించే విషయంలో భన్సాలీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరి అలియా నెక్స్ట్ షెడ్యూల్ పాల్గొంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.