సంక్రాంతి రేసు రసవత్తరంగా వుంటుందని అంతా భావించారు. కారణం ఈ రేసులో మూడు తెలుగు సినిమాలు, రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు పోటీకి సై అన్నాయి. ఇందులో ఇద్దరు అగ్ర కథానాయకులు నటించిన సినిమాలు కాగా.. మరో రెండు తమిళ క్రేజీ స్టార్స్ నటించిన సినిమాలు కావడంతో సంక్రాంతి సినిమాలపై ప్రేక్షకుల్లో సహజంగానే భారీ క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'వీర సింహారెడ్డి' జనవరి 12న, మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న ప్రేక్షకుల ముందుకొచ్చేశాయి.
ఈ సినిమాలకు ముందే తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన బ్యాంక్ రాబరీ యాక్షన్ థ్రిల్లర్ 'తునీవు' జనవరి 11నే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తెలుగులో 'తెగింపు' పేరుతో రిలీజ్ చేశారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక యావరేజ్ మూవీ అనిపించుకుని అభిమానుల్ని నిరుత్సాహ పరిచింది. ఇదే సమయంలో తమిళంలో విడుదలైన 'వారీసు' కూడా ఇదే ఫలితాన్ని రాబట్టి షాకిచ్చింది.
ఇదే మూవీని తెలుగులో జనవరి 14న విడుదల చేస్తున్నారు. ఇదిలా వుంటే భారీ అంచనాల మధ్య జనవరి 12న విడుదలైన బాలయ్య 'వీర సింహారెడ్డి' కూడా యావరేజ్ టాక్ ని దక్కించుకుంది. గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ ఫ్యాక్షన్ డ్రామా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నా.. సాధారణ ప్రేక్షకుల్ని మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక అతి హింసతో యావరేజ్ అనిపించుకుంది. దీంతో అందిరి దృష్టి చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'పై పడింది. జనవరి 13న విడుదలైన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నా కానీ ఆశించిన స్థాయి కథ, కథనాలు లేకపోవడంతో ఇది కూడా యావరేజ్ మూవీ అనిపించుకుంది.
సంక్రాంతి బరిలో హాట్ ఫేవరేట్ మూవీస్ అనిపించుకున్న సినిమాలన్నీ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోవడం, సంక్రాంతి హిట్ ఇంత వరకు పడకపోవడంతో అందరి దృష్టి ఇప్పుడు యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన 'కల్యాణం కమనీయం'పై పడింది. యువీ క్రియేషన్స్ వారు యువీ కనెక్ట్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ మూవీని జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. పెద్ద సినిమాల మధ్య చిన్న హీరో సినిమా సాండ్ విచ్ లా నలిగిపోతుందనే కామెంట్ లు నిన్న మొన్నటి వరకు వినిపించాయి.
కానీ బరిలో దిగిన సినిమాలన్నీ యావరేజ్ టాక్ ని దక్కించుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి చిన్న హీరో సంతోష్ శోభన్ నటించిన 'కల్యాణం కమనీయం' సినిమాపై పడింది. 14న విడుదలవుతున్న ఈ మూవీకి గనక గుడ్ టాక్ మొదలైందంటే సంక్రాంతికి సంతోష్ శోభన్ జాక్ పాట్ కొట్టేసినట్టేనని, అలా జరిగితే తనే సంక్రాంతి విజేతగా నిలుస్తాడనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.