ఇండస్ర్టీ స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌స్తున్న‌ట్లేనా?

Update: 2022-08-11 07:03 GMT
ఇండ‌స్ర్టీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌న్నింటిని ప‌రిష్క‌రించే దిశ‌గా పెద్ద‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న సంగ‌తి తెలిసిందే. ఒక్కో స‌మ‌స్య‌పై ఒక్కో క‌మిటీని ఏర్పాటు చేసి స‌మ‌న్వ‌యం దిశ‌గా ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేస్తున్నారు. హీరోల పారితోషికాలు త‌గ్గించుకోవ‌డానికి దాదాపు అంతా సుముఖంగానే క‌నిపిస్తున్నారు.  ప్రొడ‌క్ష‌న్ ఖ‌ర్చు ని వీలైనంత‌గా త‌గ్గించుకునేందుకు నిర్మాత‌ల అభిప్రాయాల‌తో ఏకీభ‌విస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇది కేవ‌లం నిర్మాత‌-హీరో స‌మ‌స్య మ‌ధ్య‌నే కాబ‌ట్టి సానుకూలంగానే ముగిసే అవ‌కాశం ఉంది. అయితే ఇది ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చిన త‌ర్వాత గానీ న‌మ్మ‌డానికి వీలులేదు. ఎందుకంటే అప్ప‌టి స‌న్నివేశాన్ని బ‌ట్టి కొన్ని సమీక‌ర‌ణాలు మారిపోతుంటాయి. వాటికి త‌గ్గ‌ట్టు కొన్ని విష‌యాల్లో స‌యోధ్య కుద‌ర‌డం కొన్ని కేసేస్ లో క‌ష్ట‌త‌రంగా మారే అవ‌కాశం  ఉంది.

ఇక ఓటీటీ ప‌రంగా చూస్తే మంచి కంటెంట్ అందిస్తే? జ‌నాలు థియేట‌ర్ల‌కి వ‌స్తార‌ని 'బింబిసార‌'..'సీతారామం' చిత్రాలు నిరూపించాయి. వాటితో పాటు రిలీజ్ అయిన 'పోకిరి'  రీరిలీజ్ కూడా హౌస్ ఫుల్ కావ‌డంతో నిర్మాత‌ల‌కు మ‌రింత భ‌రోసా కుదిరింది. కానీ ఓటీటీ-థియేట‌ర్ రిలీజ్ మ‌ధ్య వ్య‌త్యాసం కొన్ని ర‌కాల సందేహాల‌కి తావిస్తుంది.

ఇప్ప‌టికే థియేట‌ర్లో రిలీజ్ అయిన‌ ప‌ది వారాల త‌ర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యేలా కార్పోరేట్ తో ఒప్పందం కుదిరింది. హిట్ అయిన సినిమాల‌కు ఈ కండీష‌న్ బాగానే ఉంటుంది. మ‌రి ప్లాప్ సినిమాల ప‌రిస్థితి ఏంట‌న్న‌ది?  క్లారిటీ లేదు. థియేట‌ర్లో ఫెయిలైన సినిమా కూడా ఓటీటీ రిలీజ్ కోసం ప‌దివారాలు వెయిట్ చేయ‌డం అంటే నిర్మాత‌కు తీవ్ర న‌ష్ట‌మ‌నే చెప్పాలి.

థియేట‌ర్లో ప్లాప్ అయిన సినిమా ఓటీటీ లో వెంట‌నే రిలీజ్ చేసుకునే వెసులుబాటు  కొంత వ‌ర‌కూ నిర్మాత‌కు ఊర‌టనిస్తుంది. భారీ లాభానికి కాక‌పోయినా? ఎంతో కొంత లాభానికి ఓటీటీకి  వెంట‌నే అయితే విక్ర‌యించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అలాకానీ ప‌క్షంలో  నిర్మాత‌కి ఇది ఇబ్బందిక‌ర ప‌రిస్థితే. ప్లాప్ కంటెంట్ ని కొన‌డానికి అన్ని వారాలు గ్యాప్ వ‌స్తే  ఓటీటీలు ముందుకు వ‌చ్చే అవ‌కాశాలు తక్కువ‌.

వ‌చ్చినా లెస్ ప్రైస్ కి తీసుకునే అవ‌కాశం ఉంది. ఇది నిర్మాత‌కి న‌ష్టం. గ‌తంలో థియేట‌ర్లో ప్లాప్ అయిన సినిమాలు కూడా ఆరు వారాల త‌ర్వాత..అంత‌కు ముందుగానే!  రిలీజ్ అయ్యేవి. ఆ ర‌కంగా కొంత వ‌ర‌కూ ప్లాప్ సినిమా సేఫ్ జోన్ లో ఉండేది. కానీ ఇప్పుడు 10 వారాల కండీష‌న్ అంత‌కు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.  మ‌రి ఈ నిబంధ‌న అన్ని సినిమాల‌కు ఒకేలా ఉంటుందా?  సినిమా స్టాండ‌ర్స్డ్ బ‌ట్టి మార్పులేమైనా  చేస్తారా? అన్న‌ది చూడాలి. ఈ విష‌యంలో నిర్మాత‌-ఓటీటీ మ‌ధ్య ఎలాంటి   నిబంధ‌న అమ‌లులోకి వ‌స్తుంద‌న్న‌ది చూడాలి.
Tags:    

Similar News