రంభ రీ ఎంట్రీపై తమిళ నిర్మాత ఏమన్నారంటే
90వ దశకంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రంభ కూడా ఒకరు. సౌత్ లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది.;
90వ దశకంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రంభ కూడా ఒకరు. సౌత్ లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. గ్లామర్ రోల్స్ లో నటించిన రంభ తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటూ భారీ ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. రంభ కు ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి మహా సముద్రం సినిమాలో ఆమెపై ఉన్న ఒక స్పెషల్ సాంగే ఎగ్జాంపుల్.
తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ, బెంగాళీ, భోజ్‌పురి సినిమాల్లో నటించిన రంభ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే ఇప్పుడు మళ్లీ రంభ రీఎంట్రీకి రెడీ అయినట్టు తెలుస్తోంది. 90స్ తారలంతా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకెళ్తున్న తరుణంలో రంభ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టాలని చూస్తున్నట్టు సమాచారం.
ఆల్రెడీ రంభ ఆ ప్రయత్నాల్లో ఉందని తెలుస్తోంది. రీఎంట్రీ కి ఇదే కరెక్ట్ టైమ్ అని భావించిన రంభ రెగ్యులర్ పాత్రలు కాకుండా నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం చూస్తున్నానని చెప్తోంది. అంతే కాదు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికైనా రంభ రెడీగా ఉన్నానంటోంది. ఈ నేపథ్యంలో ఓ నిర్మాత రంభ రీఎంట్రీపై మాట్లాడారు.
తమిళ నిర్మాత కలైపులి థాను రంభ రీఎంట్రీ గురించి మాట్లాడారు. ఓ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైన ఆయన రీ ఎంట్రీ కోసం రంభ తనను సంప్రదించారని, మంచి ప్రాజెక్టు ఉంటే తనతో సినిమా చేస్తానని కూడా ఆమె ఆయనకు చెప్పినట్టు వెల్లడించారు. మరి రంభ రీ ఎంట్రీని వాడుకుని ఎవరు క్యాష్ చేసుకుంటారో చూడాలి.
ఆ ఒక్కటి అడక్కుసినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రంభ తెలుగులో ఆఖరిగా దొంగ సచ్చినోళ్లు సినిమాలో కనిపించింది. తమిళంలో పెన్ సింగం అనే సినిమాలో ఆఖరిగా 2010లో నటించిన రంభ సినిమాలకు దూరంగా ఉన్నా టీవీ ఇండస్ట్రీలో పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎంటర్ అవాలని చూస్తున్న రంభ కోసం దర్శకులు ఎలాంటి పాత్రలు రాస్తారో చూడాలి.