అక్కినేని వారబ్బాయి అఖిల్ టైమ్ ఏమీ బాగున్నట్టు లేదు.. తాను నటిస్తున్న ఐదవ సినిమా 'ఏజెంట్'తో స్టార్ హీరోల జాబితాలో చేరిపోవాలని.. పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని అఖిల్ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా వర్కవుట్ కావడం లేదు.
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్'. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక అతిథి పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్ గా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముందు నుంచి ఈ మూవీ రిలీజ్, షూటింగ్ కి అనేక అడ్డంకులు ఎదురవుతూనే వున్నాయి. 2021 డిసెంబర్ 24న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తే కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో రీలీజ్ డేట్ మళ్లీ మార్చాల్సి వచ్చింది. ఆ తరువాత 2022 ఆగస్టు 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ కుదరలేదు. రీ షూట్ ల కారణంగా ఈ డేట్ ని కూడా మరోసారి మార్చాల్సి వచ్చింది. ఫైనల్ గా ఇప్పడు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఆ తరువాత నుంచి చిత్ర బృందం నుంచి ఎలాంటి కదలిక లేదు.
ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే సంక్రాంతికి మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య', నందమూరి బాలకృష్ణ 'వీర సింహారెడ్డి' రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇదే సమయంలో తమిళ సినిమాలు 'వారీసు', తునీవు' కూడా రాబోతున్నాయి.
ఈ నాలుగు సినిమాలతో పోటీపడి 'ఏజెంట్' ని రిలీజ్ చేస్తారా అంటే కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారని సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ నిర్మాత అనిల్ సుంకర ప్రకటించారే కానీ సీరియస్ గా ఆయనకు 'ఏజెంట్' ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని లేదట. ఆ విషయం అక్కినేని అభిమానులకు తెలిసిపోవడంతో అంతా ఫిబ్రవరిని టార్గెట్ చేసుకోవడం బెటర్ అని చెబుతున్నారట. తాజా పరిణామాల నేపథ్యంలో 'ఏజెంట్' ఫిబ్రవరిలో కూడా రావడం కష్టమని తెలుస్తోంది.
కారణం ఫిబ్రవరిలోనూ రెండు క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. ధనుష్ నటిస్తున్న 'సార్' ఫిబ్రవరి 17న రాబోతోంది. ఇదే డేట్ ని మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన లేటెస్ట్ మూవీ 'దాస్ కి ధమ్కీ'కి ఫిక్స్ చేసుకున్నాడు. ఇదే 'ఏజెంట్' కు ఇబ్బందికరంగా మారిందట. ఈ నేపథ్యంలోనే 'ఏజెంట్' ఫిబ్రవరిలో కూడా రావడం కష్టమని అక్కినేని అభిమానులు ఊహిస్తున్నారట. ట్రేడ్ వర్గాలు కూడా ఇదే అంటుండటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.