సోషల్ మీడియా ట్రెండ్ లో సెలబ్రిటీలు తమ ప్రయివేటు ఫోటోలు వీడియోలను కూడా షేర్ చేస్తుండడం చూస్తున్నదే. తమ జీవితంలో ప్రతి సంతోషాన్ని లేదా వ్యక్తిగత సెలబ్రేషన్ ని అభిమానులతో షేర్ చేసేందుకు చాలా మంది కథానాయికలు వెనకాడడం లేదు. మెగా ప్రిన్సెస్ నీహారిక ఇతర నాయికల్లానే తన భర్తతో కలిసి ఉన్న ఆనందక్షణాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. నిహారిక ఐజీ కుమారుడు చైతన్యను పెళ్లాడిన సంగతి తెలిసినదే. ఇటీవలే నాగబాబు తన అల్లుడికి ఖరీదైన కార్ ని కానుకిచ్చారు.
తాజాగా నిహారిక భర్త తో కలిసి ఉన్న ఓ సంతోషకర క్షణానికి సంబంధించిన ఫోటోని షేర్ చేయగా దానిపై నెటిజనులు అతిగా స్పందించారు. చాలామంది ఇలాంటి ప్రయివేట్ ఫోటోల్ని షేర్ చేయొద్దని నిహారికకు విన్నవించారు.
ఇలాంటి ఫోటోల్ని ఆన్ లైన్ లో పోస్ట్ చేయడం ద్వారా ఆమె తన కుటుంబం పేరును దిగజార్చుతోందని.. అలాంటి చిత్రాలను పోస్ట్ చేయవద్దని వాటిని కేవలం తనతో మాత్రమే దాచుకోవాలని సూచించారు కొందరు. అలాంటివి పోస్ట్ చేయడం ద్వారా సంప్రదాయాలను దిగజార్చవద్దని కోరారు. ఇందులో ఒక వ్యాఖ్యానం అసభ్యకరం.. పూర్తి విరుద్ధం. . ఒక నెటిజన్ అడిగాడు.
నిజానికి ఒకరి వ్యక్తిగత జీవితంలో ప్రవేశించడం అంటే నిగ్రహాన్ని కోల్పోవడమే. సెలబ్రిటీల్ని అనుసరించడం ప్రశంసించడం లేదా మద్ధతుగా నిలవడం వేరు. ఇది అభిమానానికి సంబంధించినది. కానీ కొందరు తమ వెకిలి చేష్టలతో లేదా వ్యాఖ్యలతో ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరైనదేనా? ఒకరి వ్యక్తిగత జీవితంలోకి జొరబాటు సరైనదేనా? అన్నది ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఇలాంటివి కేవలం నిహారిక విషయంలోనే కాదు.. చాలా మంది సెలబ్రిటీలకు కథానాయికలకు ఎదురవుతున్న అవమానం. అభిమానం వేరు.. హద్దుమీరడం వేరు అనేది నెటిజనం గ్రహిస్తారనే ఆశిద్దాం.