ఎన్టీఆర్‌ కు వర్కౌట్‌ అయినట్లుగా సూపర్‌ స్టార్‌ కు సాధ్యమా?

Update: 2022-04-21 06:25 GMT
తమిళ సూపర్ స్టార్‌ విజయ్ తో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి చేయబోతున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఇన్నాళ్లు బీస్ట్‌ వల్ల వాయిదా పడుతూ వచ్చి ఆలస్యం అయిన విజయ్ తెలుగు సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. అతి తక్కువ సమయంలోనే దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను పూర్తి చేసేందుకు గాను పక్కాగా స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడని తెలుస్తోంది.

విజయ్ గత చిత్రాలను చూస్తే మాస్టర్‌.. బీస్ట్‌ ఇంకా పాత సినిమాలు దాదాపు అన్ని కూడా మాస్ మసాలా యాక్షన్ సినిమాలు అనడంలో సందేహం లేదు. ఆయనకు మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్‌ పెంచిన సినిమాలు చాలా నే ఉన్నాయి. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఒక ప్యూర్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ ను మాత్రం విజయ్‌ చేయక చాలా చాలా ఏళ్లు అయ్యింది.

విజయ్‌ నుండి అలాంటి ఒక సినిమా కావాలనే విషయాన్ని కూడా తమిళ ఆడియన్స్ మరియు అభిమానులు మర్చి పోయారు. అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ చేయబోతున్న సినిమా ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా సమాచారం అందుతోంది. అది కూడా అలాంటి ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ కాదు.. అది ఒక బృందావనం రేంజ్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ గా సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్‌ వరుసగా మాస్ సినిమా లు చేస్తూ యాక్షన్‌ సినిమాలకు పెద్ద పీట వేస్తున్న సమయంలో అనూహ్యంగా ఎన్టీఆర్‌ కు బృందావనం అనే విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ను వంశీ పైడిపల్లి ఇచ్చాడు. ఇప్పుడు అదే తరహా ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ను దర్శకుడు వంశీ ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ విజయ్‌ కి ఇస్తాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ కు బృందావనం వర్కౌట్‌ అయ్యింది. కాని పూర్తి మాస్ ఇమేజ్ తో రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ విజయ్ ని ఒక్కసారిగా ఫ్యామిలీ కథలో చూపించడం అంటే ఖచ్చితంగా రిస్క్ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని వంశీ పైడిపల్లి కథ ఎంపిక చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా అది ఎలాంటి హీరోకు అయినా సెట్‌ అయ్యేలా ఉంటుంది. అందుకే ఈ ఫ్యామిలీ మూవీ కూడా విజయ్ కి తప్పకుండా భారీ విజయాన్ని తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది
Tags:    

Similar News