యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య గత కొంతకాలంగా వరుస విజయాలతో ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. 'మజిలీ' 'వెంకీమామ' 'లవ్ స్టోరీ' 'బంగార్రాజు' వంటి నాలుగు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. అయితే ఈ సినిమాల సక్సెస్ లో చైతూతో పాటుగా ఇతర కో స్టార్స్ కు కూడా క్రెడిట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో తరచుగా కామెంట్స్ వినిపిస్తుంటాయు.
'మజిలీ' సినిమాలో చై మాజీ భార్య సమంత.. 'లవ్ స్టోరీ' లో సాయి పల్లవి ఫ్యాక్టర్ బాగా పనిచేసిందని.. అలాగే 'వెంకీమామ' - 'బంగార్రాజు' చిత్రాల్లో మామ వెంకటేశ్ మరియు తండ్రి అక్కినేని నాగార్జున సపోర్ట్ ఉందని అభిప్రాయ పడుతుంటారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాల్సిన అవసరం ఏర్పడింది.
ఇలాంటి పరిస్థితులుల్లో నాగచైతన్య నటించిన ''థాంక్యూ'' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథ అందించారు. దిల్ రాజు నిర్మించారు. ఈ వీకెండ్ లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి ప్రీమియర్ షోల నుంచి మంచి టాక్ వచ్చింది. అయితే రిలీజ్ డే మొదటి ఆటతో అది మిశ్రమ స్పందనగా మారింది.
ఈ నేపథ్యంలో 'థాంక్యూ' సినిమాకు తొలిరోజు ఆశించిన కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 3 కోట్ల లోపే ఉంటాయిని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక నైజాంలో అయితే ఈ సినిమా 70 లక్షల దగ్గరే ఆగిపోయిందని అంటున్నారు. నాగచైతన్య కెరీర్ లోనే తక్కువ ఓపెనింగ్స్ ఇవేనని చెబుతున్నారు.
పాండమిక్ తర్వాత జనాలు థియేటర్లకు రావడం తగ్గించారనేది వాస్తవం. దీనికి తగ్గట్టుగా స్టేజీ మీద చెప్పిన దానికంటే టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు భారీ వర్షాలు కూడా వీటికి తోడయ్యాయి. కారణాలు ఏవైనా 'థాంక్యూ' సినిమా ఓపెనింగ్ డే వసూళ్ళు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. రెండో రోజు బుకింగ్స్ కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. ఎంతొచ్చినా ఈ రెండు రోజులే అనే మాటలు వినిపిస్తున్నాయి.
దీంతో ఇతర స్టార్స్ సపోర్ట్ లేకుండా నాగచైతన్య భారీ ఓపెనింగ్స్ రాబట్టలేడనే కామెంట్స్ మళ్లీ ఊపందుకున్నాయి. ఇలాంటి ఓపెనింగ్స్ రావడానికి వేరే ఇతర కారణాలు కూడా ఉన్నప్పటికీ.. ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ ఇదే విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. అక్కినేని హీరో స్టార్ పవర్ ఇదేనని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
కారణాలు ఏవైతేనేం 'జోష్' సినిమాతో నాగచైతన్య ను హీరోగా సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయలేకపోయిన దిల్ రాజు.. 'థాంక్యూ' చిత్రంతో ఆ బాకీ తీర్చుకోలేకపోయాడని అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టి సరిగ్గా జనాల్లోకి సినిమాని తీసుకెళ్లి ఉంటే మంచి ఓపెనింగ్స్ అయినా వచ్చేవని నిందిస్తున్నారు.
ఇక చైతూ సైతం స్క్రిప్టు ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొన్నాళ్లు క్లాస్ సినిమాలను పక్కనపెట్టి మాస్ యాక్షన్ చిత్రాలు చేయాలని కోరుతున్నారు. అవైతే టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ కు మాత్రం డోకా ఉండదని భావిస్తున్నారు. తదుపరి చిత్రంతో కచ్చితంగా తన స్టార్ పవర్ ఏంటో చూపిస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.