సమంత ఆ కొత్త సినిమా నిజమేనా?

Update: 2022-12-12 23:30 GMT
సమంత మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. అనారోగ్య సమస్యల కారణంగా ఆమె సినిమాల ప్లానింగ్స్ మొత్తం కూడా చెడి పోయాయి. సౌత్‌ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌ లో సినిమాలు మరియు సిరీస్ లను చేయాలని సమంత ప్లాన్ చేసుకుంది. అక్కడ కొన్ని ప్రాజెక్ట్‌ లకు సైన్ కూడా చేసింది.

నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సినిమాలతో బిజీ అవ్వాలని సమంత కోరుకుంది. అందులో భాగంగానే ఉత్తరాదిన వెబ్‌ సిరీస్ లో మరియు రెండు మూడు హిందీ సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వచ్చాయి. అందులో ఒకటి తాప్సీ నిర్మాణంలో రాబోతుందని కూడా వార్తలు వచ్చాయి. ఒక ఇంగ్లీష్ మూవీలో సమంత నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

సమంత ఇన్ని ప్రాజెక్ట్‌ లు కమిట్ అయిన సమయంలో పాపం అనారోగ్య కారణంగా పూర్తిగా అన్నింటిని పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికే ఆమె నటించి షూటింగ్ పూర్తి అయిన సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే శాకుంతలం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

యశోద సినిమాకు పాజిటివ్‌ టాక్ వచ్చింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా యశోద ఉందంటూ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపు విజయ్ దేవరకొండ ఖుషి సినిమా కూడా సమంత అనారోగ్య సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే.

సమంత ఇటీవల రాహుల్ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఒక లేడీ ఓరియంటెడ్‌ సినిమాను చేసేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత కొత్త సినిమాలకు ఓకే చెప్పలేదు. ఇప్పటి వరకు ఆమె కమిట్‌ అయిన సినిమాలు మరియు వెబ్‌ ప్రాజెక్ట్‌ లను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే కొత్త ప్రాజెక్ట్‌ లు కమిట్ అయ్యే అవకాశం ఉంది.

అనారోగ్య సమస్యల నుండి బయట పడేందుకు ప్రయత్నాలు చేస్తున్న ముద్దుగుమ్మ సమంత అతి త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. సమంత శాకుంతలం సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News