'జెర్సీ' కాపీ క‌థేనా? హైకోర్టు ఏమ‌ని తేల్చింది?

Update: 2022-04-20 04:45 GMT
నాని క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించిన జెర్సీ చిత్రం క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రం హిందీలో షాహిద్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించి రిలీజ్ కి రెడీ చేశారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణలో దిల్ రాజు నిర్మాత‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. అయితే రిలీజ్ ముంగిట ఊహించ‌ని ట్విస్టులు షాకిస్తున్నాయి. ఈ సినిమా క‌థ నాదీ అంటూ హిందీ రచయిత రజనీష్ జైస్వాల్ కోర్టుకెక్కిన సంగ‌తి తెలిసిందే. అయితే అత‌డికి క్రెడిట్ ఇవ్వాలని బాంబే హైకోర్టు తాజా తీర్పులో 'జెర్సీ' నిర్మాతలను కోరింది.

జెర్సీ- హిందీ వెర్ష‌న్ విడుదల స‌న్నివేశం ఇప్ప‌టివ‌ర‌కూ ర‌క‌ర‌కాల మ‌లుపులు తీసుకుంది.  విడుదల తేదీతో మొదట నుంచీ ఏవో అడ్డంకులు ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పుడు ఈ మూవీ రచన క్రెడిట్లకు సంబంధించి కోర్టు ప‌రిధిలో విచార‌ణ సాగుతోంది. తాజా బజ్ ఏమిటంటే.. రజనీష్ జైస్వాల్ అనే రచయిత 2007లో సినిమా స్క్రిప్ట్ ను రిజిస్టర్ చేసానని ఈ చిత్రం తన కథాంశానికి కాపీ అని పేర్కొంటూ సినిమా విడుదలకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

మరోవైపు మేకర్స్ అదే కథాంశంతో 2019 లో తెలుగులో సినిమా తీసి రిలీజ్ చేశారు. రచయిత అప్ప‌ట్లోనే ఈ క‌థ తనది అని ఎందుకు చెప్పుకోలేదు? అప్ప‌ట్లోనే కోర్టును ఆశ్ర‌యించాలి క‌దా? అని హైకోర్ట్ అత‌డిని ప్ర‌శ్నించింది. అయితే త‌న క్లైంట్ కి తెలుగు తెలియ‌ద‌ని అందుకే ఆ సినిమా అర్థం కాలేద‌ని త‌న త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు.

బాలీవుడ్ న్యూస్ పోర్టల్ ప్రకారం.. బాంబే హైకోర్టు న్యాయమూర్తులు KR శ్రీరామ్ - NR బోర్కర్ లతో కూడిన బెంచ్ రచయిత రజనీష్ జైస్వాల్ కు క్రెడిట్ ఇవ్వడం గురించి ఆలోచించగలరా అని 'జెర్సీ' మేక‌ర్స్ ని  కోరింది. జైస్వాల్ కు ఎలాంటి ఉపశమనం కల్పించేందుకు బాంబే హైకోర్టు సింగిల్ బెంచ్ నిరాకరించిందని అందుకే ఆయన హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారని తాజా క‌థ‌నం పేర్కొంది. ఇప్పటికే తెలుగులో రిలీజైన సినిమాపై జైస్వాల్ ఎలాంటి రిలీఫ్ క్లెయిమ్ చేయలేదని ఈ నెలలో విడుదల కానున్న హిందీ సినిమాపై రిలీఫ్ అడిగారంటూ బెంచ్ సందేహించింది.

జైస్వాల్ తరపు న్యాయవాది విశాల్ కనాడేను ధర్మాసనం ఈ విష‌య‌మై ప్రశ్నించింది. ఇలాంటి కేసుతో ఇక్కడికి ఎలా వచ్చావు? అని కోర్టు ప్ర‌శ్నించ‌గా.. కానాడే బదులిస్తూ.. త‌న క్ల‌యింట్ మాతృభాష తెలుగు కాద‌ని.. తెలుగు సినిమా గురించి నాకు తెలియదని.. అందుకే అప్పుడు వాదించ‌లేదు'' అని బదులిచ్చారు. చట్టపరమైన చిక్కుల పరిధిని దాటి జైస్వాల్ ఏమి కోరుకుంటున్నారో అడిగి తెలుసుకోవాలని బెంచ్ కనాడేను కోరింది.

కానడే దానికి ఏమ‌న్నారంటే.. నా సూచనలు ఏమిటంటే అవతలి వైపు క్రెడిట్ ఇస్తే.. ఈ సూట్ నిర్ణయించవచ్చు.. అని అన్నారు. అయితే కోర్టు మాత్రం 'జెర్సీ' మేకర్స్ తరపు న్యాయవాదిని 'దీనిని జస్ట్ పరిగణలోకి తీసుకోండి'' .. ''దాని గురించి ఆలోచించండి'' అని కోరింది. సినిమాలను కోర్టుకు లాగినప్పుడల్లా అవి బాక్సాఫీస్ వద్ద హిట్లు కొట్టాయి. ఇప్పుడు హిందీ జెర్సీ కూడా అలాంటి పెద్ద హిట్టు కొడుతుందేమో చూడాలి. దిల్ రాజు -అల్లు అర‌వింద్ లక్కీ ఛామ్ గ‌నుక పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని ఆశించ‌వ‌చ్చేమో!
Tags:    

Similar News