టాలీవుడ్ లో చందమామ కాజల్ అగర్వాల్ సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. 15 ఏళ్లగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఇన్నేళ్లగా చందమామ అంటే ఓ బ్రాండ్ గా వెలిగింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు మినహా హీరోయిన్ గా మాత్రం టాలీవుడ్ ని కొన్నాళ్ల పాటు ఏలింది.
కోలీవుడ్ లోనూ ఇదే దూకుడు కొనసాగించింది. ఆ రకంగా తెలుగు..తమిళ భాషలు అమ్మడికి ఎంతో ప్రత్యేకం. అయితే గౌతమ్ కిచ్లు తో ప్రేమ పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. కెరీర్ చరమాంకానికి చేరుకుందని ఆ కారణంగానే పెళ్లి చే సుకుందని వదంతు వచ్చినా..కాజల్ కి అవకాశాలు తగ్గింది లేదు. తనకు తానుగానే కావాలనే సినిమాల నుంచి తప్పుకుందని కొన్ని సంకేతాలు చెబుతున్నాయి.
వివాహం తర్వాత కాస్త సెలక్టివ్ గా వెళ్లడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో అన్ని రకాల సినిమాలకు వెంటనే ఒప్పుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ రకంగా కొన్ని అవకాశాలు తాను కాదనుకుంటే ..మరికొన్ని దరి వరకూ చేరి వెళ్లాయి. ఇక గర్భం దాల్చిన తర్వాత సినిమా అనే ప్రపంచానికే దూరమైంది. కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం మినహా సినిమా మాట నోట రాలేదు.
ఇక పాపాయికి జన్మనిచ్చిన తర్వాత పూర్తిగా కుటుంబ జీవితానికే అంకితమైంది. ఈ నేపథ్యంలో కాజల్ రీ ఎంట్రీ కి రెడ అవుతుందా? రిటైర్మెంట్ ప్రకటిస్తుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. సినిమాలకు దూరంగా ఉండటం సహా....వాటిపై అంత ఆసక్తిని చూపించకపోవడంతోనే ఈ సందేహాలు తెరపైకి వస్తున్నాయి. పూర్తిగా బిడ్డ ఆలనా పాలనలో మునిగిపోయింది. వీలైనంత వరకూ ప్రశాంతత కోరుకుంటున్నట్లు కనిపిస్తుంది.
అలాగే వ్యాపార రంగంలో స్థిరపడి సెకెండ్ ఇన్నింగ్ స్స్ ని కూల్ గా సాగించాలని ప్లాన్ చేస్తుందని వినిపిస్తుంది. అదే నిజమైతే కాజల్ చెల్లి నిషా అగర్వాల్ దారిని ఎంచుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే నిషా జ్యుయలరీ...ఫుట్ వేర్ బిజినెస్ లో సక్సెస్ ఫుల్ ఉమెన్ గా కొనసాగుతుంది. కాజల్ పెట్టుబడులు కూడా అందులో ఉన్నాయి.
సినిమా రంగంలో రాణించలేని నిషా తో కాజల్ నే ఆ వ్యాపారం ప్రారంభించింది. అటుపై ఆ బిజినెస్ ని నిషా అగర్వాల్ సక్సెస్ చేసింది. అందుకే ఇప్పుడు కాజల్ చెల్లితో కలిసి మరిన్ని వ్యాపారాలు మొదలు పెట్టే దిశగా అడుగులు వేస్తుందని వినిపిస్తుంది. మరోవైపు భర్త గౌతమ్ కిచ్లు కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ అన్న సంగతి తెలిసిందే.