ఎవరి కోపతాపాలు వారికుంటాయి. ఆర్టిస్టుల నడుమ ఈగోలు ఘర్షణలు వగైరా వగైరా ఉంటాయి. పరభాషా నటీనటులు తెలుగు సినీపరిశ్రమపై కర్ఛీఫ్ వేయడం అస్సలు నచ్చని వాళ్లు ఉంటారు. ఈ విషయంలో కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్లు ప్రతిసారీ సీరియస్ అవుతూనే ఉన్నారు. తెలుగులో తెలుగు నటీనటులకు అవకాశాలు ఇవ్వాలని ఉద్యమించిన వారిలో కోట ప్రముఖుడు.
ప్రస్తుత మా ఎన్నికల వేళ ఆయన కోపం ప్రదర్శించారు. అసలు `మా` ఎన్నికలను ఎవరు ప్రకటించారు?.. ఇప్పుడున్న కమిటీ ఏమైనా ప్రకటించిందా?. ఏదో ప్యానల్ అని ప్రకటించారు.. నాకదే ఆగ్రహం కలిగించింది. టైమొస్తే మాట్లాడదాం.. ఇప్పుడది అనవసరం.. అంటూ సీరియస్ గానే కనిపించారు కోట. ప్రకాష్ రాజ్ కి చిరు మద్ధతిచ్చారో లేదో నాకు తెలీదు. నాగబాబు వ్యాఖ్యలు సరికాదు అని అనేశారు.
మొత్తానికి కోట శ్రీనివాసరావు తెలుగు అసోసియేషన్ అయిన `మా` పై పరాయి నటుల పెత్తనాన్ని సహించరని అర్థమవుతోంది. ప్రకాష్ రాజ్ కి ఆయన ఓటేయరని ఆయన మాటలే చెబుతున్నాయి. ఆయన ఏ వర్గానికి చెందుతారు? అన్నది వేచి చూడాలి.