క్రేజీ హీరోయిన్‌ షాకింగ్‌ నిర్ణయం

Update: 2020-03-23 05:02 GMT
టాలీవుడ్‌ ప్రేక్షకులకు మహేష్‌ బాబు ‘1 నేనొక్కడినే’ చిత్రంతో పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి సనన్‌. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగులో చైతూ సరసన దోచెయ్‌ లో నటించింది. ఆ తర్వాత తెలుగు నుండి ఆఫర్లు వచ్చినా కూడా ఈమె నిరాకరించింది. కారణం బాలీవుడ్‌లో ఈ అమ్మడు ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారిన ఈ అమ్మడు ‘మిమి’ అనే చిత్రంలో నటిస్తోంది.

లేడీ ఓరింటెడ్‌ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి సనస్‌ సరోగసీ మదర్‌ పాత్రలో కనిపించబోతుంది. ఈ పాత్ర కోసం కృతి సనన్‌ ఏకంగా 15 కేజీల బరువు పెరిగినట్లుగా సమాచారం అందుతోంది. గర్బవతిగా కనిపించేందుకు కృతి సాహసం చేసినట్లుగా చెబుతున్నారు. స్టార్‌ హీరోయిన్స్‌ క్రేజీ హీరోయిన్స్‌ ఈ స్థాయిలో బరువు పెరిగేందుకు ఇష్టపడరు. అది కెరీర్‌ పై ప్రభావం చూపుతుందేమో అని భయపడతారు.

ప్రస్తుతం పలు చిత్రాల్లో ఆఫర్లు వస్తున్నా కూడా ఈమె మాత్రం మిమి సినిమా కోసం బరువు పెరిగి ఇతర సినిమాలకు నో చెబుతూ వస్తోంది. మిమి సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత మళ్లీ కృతి సనన్‌ బరువు తగ్గే అవకాశం ఉంది. కాని కొందరు బరువు పెరిగి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తగ్గలేక పోయారు. మరి కృతి సనన్‌ కు ఆ విషయం తెలిసి కూడా ఏకంగా 15 కేజీల బరువు పెరిగి సాహసం చేసింది. ఆమె తీసుకున్న నిర్ణయం సరైనది కాదని కొందరు అంటూ ఉంటే మరికొందరు మాత్రం పాత్ర కోసం ఆమె పడుతున్న తాపత్రయంను అభినందిస్తున్నారు.
Tags:    

Similar News