లావ‌ణ్య లాజిక్ న‌మ్మ‌శక్య‌మేనా?

Update: 2022-07-06 11:30 GMT
లావ‌ణ్య త్రిపాఠి అలియాస్ అందాల రాక్ష‌సి గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. స్టార్ హీరోయిన్ గా వెల‌గ‌లేదు గానీ.. టాలీవుడ్ కి వెల్ నోన్ బ్యూటీ. కొన్ని సంప్ర‌దాయాల‌తో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు చాలా సినిమాల్లో న‌టించింది. కానీ  స్టార్ హీరోయిన్ల జాబితాలో మాత్రం ఇంకా స్థానం సంపాదించ‌లేదు. న‌టిగా ఇంకా పోరాటం చేస్తూనే ఉంది. ఏరోజైనా అగ్ర నాయిక‌ల స‌ర‌స‌న  చేర‌క పోతోనా?  నాకంటూ ఓ పేజీ  లిఖించ‌కుండా ఉంటానా?  అన్న న‌మ్మ‌కంతో ప్ర‌య‌త్న లోపం లేకుండా శ్ర‌మిస్తుంది.

అందుకు నిజంగా బ్యూటీని మెచ్చుకోవాల్సిందే. ఆ సంక‌ల్పంతోనే ఇంకా అవకాశాలు అందుకోగ‌ల్గుతుంది. కెరీర్ ప్రారంభ‌మై ద‌శాబ్ధం దాటింది.  ఈ ప్ర‌యాణంలో  చాలా మంది హీరోయిన్లు వ‌చ్చారు..వెళ్లారు.  కానీ లావ‌ణ్య‌కి మాత్రం న‌వ నాయిక‌లు ఎవ‌రూ  పోటీ కాదు. త‌న‌కు తానే పోటీ. సీనియ‌ర్ల‌తో పోటీకి దిగదు. అందివ‌చ్చిన అవకాశాలు స‌ద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిపోతుంది.

సాధార‌ణంగా డౌన్ పాలో లో ఉన్నఏ  హీరోయిన్ కెరీర్ ఇంత ప్ర‌శాంతంగా సాగ‌దు.  ఆ విష‌యంలో లావ‌ణ్య ల‌క్కీ గాళ్ అనే తెలుస్తుంది. న‌టిగా కొన్ని ప‌రిమితుల‌తో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ వాటిని తూచ త‌ప్ప‌కుండా పాటిస్తుంది. అయితే కెరీర్ ప్రారంభ‌మై 10 ఏళ్లు దాటినా ఇంకా టాప్ లీగ్ లోకి చేర‌లేదు. ఇలాంటి భావ‌న ఏనాడైనా క‌లిగిందా? నటిగా గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నారు?  గ్యాప్ మీరు ఇస్తున్నారా?  వ‌స్తుందా? అని కొన్ని ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు లావ‌ణ్య ముందుకెళ్తే తెలివైన స‌మాధానం ఇచ్చింది.

' ఇలాంటి పాత్ర‌లే చేయాల‌ని ఆలోచించ‌ను. న‌టిగా బ‌ల‌మైన పాత్ర‌లే చేయాల‌నుకుంటా. చేసిన‌వి మ‌ళ్లీ చేయ‌డం న‌చ్చ‌దు. అందుకే అంద‌రికీ నేను సినిమాలు త‌గ్గించిన‌ట్లు అనిపించ‌వ‌చ్చు' అని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్య‌లు న‌మ్మ‌శ‌క్యంగా లేవ‌ని ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్  అభిప్రాయ‌ప‌డుతున్నారు.  లావ‌ణ్య లాజిక్ ని ఒప్పుకోవ‌డం లేదు. హీరోయిన్ల మ‌ధ్య పోటీ  గురించి చె ప్పాల్సిన ప‌నిలేన‌దు.

స్టార్ హీరోయిన్లే అవ‌కాశాల కోసం క్యూ క‌డుతోన్న స‌మ‌యం. స్వీటీ అనుష్క సైతం కి అవ‌కాశాలు లేక ఇంటికే ప‌రిమిత‌మైంది. అవ‌కాశాలు రాని ఎంతో మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని స్థిర‌ప‌డ్డారు. హీరోయిన్లు అంటే తెర‌పై అద్భుతాలు చేసేది చాలా త‌క్కువ సంద‌ర్భంలోనే. హీరోయిన్ల‌కు స్పాన్ కూడా త‌క్కువే. ఇలా ఏ హీరోయిన్ కోణంలో చూసినా  ఇన్ని డ్రా బ్యాక్స్  స‌హ‌జంగానే క‌నిపిస్తాయి.

లావ‌ణ్య విష‌యంలో చాలాసార్లు ఇలాంటి ప్ర‌శ్న‌లు సైతం ఉత్ప‌న్నం అయ్యాయి.  స్టార్ హీరోయి కాకుండానే కెరీర్ బండిని ఎలా నెట్టుకొస్తుంద‌ని సందేహాలు చాలాసార్లు   తెర‌పైకి  వ‌చ్చాయి. అందుకు ర‌క‌ర‌కాల కార‌ణాలు వైర‌ల్ అయ్యాయి. కానీ లావ‌ణ్య తాజాగా వెదికిన లాజిక్ పై  మాత్రం నెటి జ‌నుల నుంచి సంతృప్తిక‌ర స‌మాధానాలు రావ‌డం లేదు.

అలాగే త‌న ప్ర‌యాణానికి ఎలాంటి గ‌మ్యాలు సైతం నిర్దేశించుకున్న‌ట్లు క‌నిపించ‌లేదు. వృత్తి ప‌రంగా ఎలాంటి ల‌క్ష్యా లు లేవ‌ని.. అవ‌కాశాలున్నంత కాలం కొన‌సాగ‌డం త‌ర్వాత నిష్ర్క‌మ‌ణ త‌ప్ప ఇంకేముంటుంది? అన్న వైఖ‌రి క‌నిపిస్తుంది. ప్ర‌స‌త్తుం లావ‌ణ్య‌ 'హ్యాపీ బ‌ర్త్  డే' సినిమాతో సోలోగా స‌త్తా చాట‌డానికి రెడీ అయింది. మ‌రి ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాలు సాధిస్తుందో చూడాలి.    
Tags:    

Similar News