లావ‌ణ్య త్రిపాఠి కెరీర్ క్లోజ్ అయిన‌ట్లేనా?

Update: 2022-10-28 12:30 GMT
లావణ్య త్రిపాఠి.. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మొదట మోడలింగ్ లోకి అడుగు పెట్టిన ఈ భామ.. 'అందాల రాక్షసి' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి చిత్రంతోనే తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన లావణ్య త్రిపాఠి.. యూత్ లో సైతం విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

'అందాల రాక్షసి' తర్వాత లావణ్య త్రిపాఠి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదు. ఆమె నటించిన చిత్రాల్లో 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్నినాయనా', 'అర్జున్ సురవరం' చిత్రాలు మినహా మిగిలినవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కెరీర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఈమె నుంచి చివరిగా వచ్చిన 'ఎ1 ఎక్స్‌ప్రెస్', 'చావు కబురు చల్లగా', మరియు 'హ్యాపీ బర్త్ డే' చిత్రాలు సైతం ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాయి. ఆకట్టుకునే అందం, అంతకుమించి నటన ప్రతిభ ఉన్న అదృష్టం లేకపోవడంతో లావణ్య వరుస ఫ్లాపులతో తీవ్రంగా సతమతమవుతుంది.

దీంతో ఇప్పుడు లావణ్యకు అవకాశాలు కరువయ్యాయి. 'హ్యాపీ బర్త్‌డే' ఫ్లాప్ తర్వాత లావణ్య నుంచి ఒక్క కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. స్టార్ హీరోల సంగతి అటుంచితే కనీసం టైప్ 2 హీరోలు కూడా ఆమె వైపు చూడటం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది.

దీంతో లావణ్య త్రిపాఠి కెరీర్ క్లోజ్ అయినట్టే అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి వారి అంచనాలను లావణ్య త్రిపాఠి నిజం చేస్తుందా..? లేక మళ్ళీ ఆఫర్లు అందుకుని కెరీర్ ను ముందుకు సాగిస్తుందా..? అన్నది చూడాలి.

కాగా, మొన్నాధ్య లావ‌ణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తోంద‌ని, వీరిద్ద‌రు పెళ్లి కూడా చేసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ టైమ్‌లో లావ‌ణ్య‌ మెగా కోడ‌లు కాబోతోందంటూ జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఈ వార్త‌ల‌కు ఆమె ప‌రోక్షంగా చెక్ పెట్టేసింది. ఓ ఇంట‌ర్వ్యూలో తాను సింగిల్ అని, ఎవ‌రితోనూ ప్రేమ‌లో లేన‌ని లావ‌ణ్య త్రిపాఠి తేల్చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News