రాఘవ లారెన్స్ స్వీయా దర్శతకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కాంచన' ప్రాంచైజీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. రొటీన్ కంటెంట్ తోనే కాంచన ప్రాంచైజీని పెద్ద సక్సెస్ చేయడంలో లారెన్స్ నూరుశాతం సక్సెస్ అయ్యారు. ఆ కాన్పిడెన్స్ తోనే 'దుర్గ' అనే టైటిల్ తో ఆ మధ్య మరో హారర్ చిత్రాన్ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే లారెన్స్ ఫీవర్ తెప్పించాడు. తెల్లటి గడ్డం.. నుదుటిన కుంకుమ బొట్టు తో సన్యాసి అవతారంలో కన్పించడం ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్ రీవీల్ తోనే మూవీ ఖచ్చితంగా హర్రర్ జోనర్ అని అర్దమైపోయింది. కాంచన-4 గా దుర్గ టైటిల్ తో వస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. ఈ సినిమా కూడా తన సొంత నిర్మాణ సంస్థ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ లోనే ప్రకటించారు.
నటుడిగా లారెన్స్ ఫిక్స్ అయ్యారు. యధావిధిగా దర్శకత్వ బాధ్యతలు కూడా తానే తీసుకుంటారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా కొత్త మేకర్ ని తెరపైకి తీసుకొచ్చారు. స్టంట్ మాస్టర్స్ అన్బరీవ్ అనే కొత్త మేకర్ ఈ చిత్రానికి పనిచేసే అవకాశం కల్పించారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూట్ కి రెడీ అవుతున్నారు.
అయితే అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి అన్బరీవ్ తప్పుకున్నారు. అతనికి కొన్ని సినిమాల్లో ఫైట్లు కంపోజిషన్ తో బిజీ గా ఉండటం వల్ల వచ్చిన అరుదైన అవకాశాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసారు.
''స్టంట్ మాస్టర్లుగా...కొరియోగ్రాఫర్ గా పనిచేసిన నాకు దర్శకత్వం అవకాశం లారెన్స్ కల్పించారు. సినిమాల్లోకి దర్శకుడు అవ్వాలనే వచ్చాను. కానీ ముందుగా స్టంట్ మాస్టర్ గా..కొరియోగ్రాఫర్ గా పనిచేసాను. సినిమా రంగంలో ముందుగా నాకు ఈ అవకాశాలే వచ్చాయి. ఇప్పుడు దర్శకుడిగా అవకాశం వచ్చిందని వాటిని వదిలేసి ఉన్న పళంగా అటువైపు వెళ్లలేని పరిస్థితులున్నాయి.
ఇప్పటికే కొన్ని సినిమాలకు స్టంట్ మాస్టర్లగా కమిట్ మెంట్ ఇచ్చాను. వాటిని వీలైనంత త్వరగా పూర్తిచేయాల్సిన బాధ్యత నాపై ఉంది. కానీ నాపై నమ్మకంతో లారెన్స్ దర్శకుడిగా పనిచేసే అవకాశం కల్పించారు. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కానీ తాజా పరిస్థితుల నడుమ దుర్గ సినిమాకి పనిచేయలేకపోతున్నాను.
తమ పరిస్థితిని అర్ధం చేసుకుని తప్పుకుంటున్న విషయాన్ని ఆయన ఎంతో మన మంచి మనసుతో అర్ధం చేసుకున్నట్లు'' తెలిపారు. దీంతో 'దుర్గ' సినిమాకి దర్శకత్వం బాధ్యతలు లారెన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కాంచన ప్రాంచైజీని సక్సెస్ ఫుల్ చేసిన మేకర్ గా ఆయనకి మంచి పేరుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆఛాన్స్ లారెన్స్ తీసుకోనున్నారు.