'లైగ‌ర్' డైరెక్ట‌ర్ జ‌క్క‌న్న‌ని ఫాలో అవుతున్నాడా?

Update: 2022-08-13 06:45 GMT
రైడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ డ్రామా 'లైగ‌ర్‌'. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. ఉస్తాద్ రామ్ హీరోగా తెర‌కెక్కించిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌'తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన పూరి 'లైగ‌ర్‌'తో ఏకంగా పాన్ ఇండియానే టార్గెట్ చేశాడు. తెలుగుతో పాటు హిందీలోనూ ఏక కాలంలో నిర్మాణం జ‌రుపుకున్న ఈ మూవీతో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకోవాల‌ని ప్లాన్ చేశాడు. ఆగ‌స్టు 25న అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అన‌న్య పాండే న‌టించ‌గా, కీల‌క అతిథి పాత్ర‌లో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ బాక్స‌ర్ మైక్ టైస‌న్ న‌టించారు. దీంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇంత వ‌ర‌కు విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి.  త‌ల్లిగా ర‌మ్య‌కృష్ణ, విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, త‌న బోల్డ్ యాక్ట్ ప్రేక్ష‌కుల్లో సినిమాపై అంచ‌నాల్ని, భారీ బ‌జ్ ని క్రియేట్ చేసింది.  

ఇదిలా వుంటే ఈ మూవీ హీరో విజ‌య్ కెరీర్ కి అత్యంత కీల‌కంగా మారింది. ఇంత వ‌ర‌కు చేసిన సినిమాలు ఏవీ పెద్ద‌గా బాక్సాఫీస్ వ‌ద్ద రాణించ‌క‌పోవ‌డం, 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్' వంటి డిజాస్ట‌ర్ మూవీ త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన సినిమా కావ‌డంతో 'లైగ‌ర్‌'తో ఎలాగైనా పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో వున్నాడు. ఇందు కోసం సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఫ్యాన్ డ‌మ్ పేరుతో దేశ వ్యాప్తంగా తిరుగుతూ మూవీ ప్ర‌మోష‌న్స్ ని జోరుగా నిర్వ‌హిస్తున్నాడు.

ముంబైలోని ఓ మాస్ లో నిర్వ‌హించిన ఈవెంట్ కు ఫ్యాన్స్ లెక్క‌కు మించి రావ‌డంతో షాక్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ అప్ప‌టి నుంచి ఈ మూవీ కోసం దేశ వ్యాప్తంగా ప్ర‌మోష‌న్స్ కోసం తిర‌గ‌డం మొద‌లు పెట్టాడు. 14న వ‌రంగ‌ల్ లో భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేయ‌బోతున్నారు. ఇదిలా వుంటే తాజాగా ఈ మూవీ నుంచి 'కోకా 2.O' అంటూ సాగే మాంచి మాసీవ్ పంజాబీ బీట్ సాంగ్ ని విడుద‌ల చేశారు. ఈ పాట‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ పంజాబీ యువ‌కుడిగా ప‌గిడీ ధ‌రించి స్టెప్పులు వేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.

ఈ పాట‌లో హీరోయిన్ అనన్య పాండే తో పాటు ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ కూడా ప‌గిడి ధ‌రించి విజ‌య్ తో పాటు స్టెప్పులేసిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇంత వ‌ర‌కు త‌న సినిమాల్లో చిన్న పాత్ర‌ల్లో మాత్ర‌మే క‌నిపించే పూరి 'లైగ‌ర్‌'లో మాత్రం హుషారుగా హీరోతో క‌లిసి స్టెప్స్ వేస్తూ క‌నిపించ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట‌లో పూరి చాలా కాన్ఫిడెంట్ గా క‌నిపించ‌డంతో రాజ‌మౌళిని ఫాలో అవుతున్నాడ‌ని కామెంట్ లు చేస్తున్నారు.

మ‌గ‌ధీర‌, RRR సినిమాల‌ ఎండింగ్ లో జ‌క్క‌న్న టీమ్ తో క‌లిసి స్టెప్పులేస్తూ క‌నిపించిన తీరు అందిరికి తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాని పూరి కూడా 'లైగ‌ర్‌' కు ఫాలో అవుతున్నాడ‌ని కామెంట్ లు చేస్తున్నారు. పూరి కాన్ఫిడెన్స్ ఏ మేర‌కు నిజ‌మ‌వుతుంద‌న్న‌ది తెలియాలంటే ఆగ‌స్టు 25 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News