పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. 'డీలక్స్ రాజా' టైటిల్ తో తెరకెక్కుతున్నచిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే సినిమా ప్రారంభం కానుంది. చిత్రీకరణ కోసం ఓ భారీ సెట్ ని నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మారుతి చాలా పకడ్భందీగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రైటర్లని సైతం స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ చేసినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
ఈ విషయంలో మారుతి రచయిత..దర్శకుడు వాసువర్మ తో పాటు ఇంకొంత మంది రచయితల సూచనలు..సలహాలు...వాళ్ల అధ్వర్యంలో స్క్రిప్ట్ పరంగా కలిసి వర్క్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. సాధారణంగా మారుతి తన సినిమాలకు తానే రచన చేసుకుంటారు. కథ..మాటలు.కథనం మొత్తం స్వరం తానే అవుతారు. ఇప్పటివరకూ మారుతి తీసిన సినిమాలన్నీ వన్ మ్యాన్ ఆర్మీగానే రూపొందాయి. ఇతర రచయితల పై ఆధారపడలేదు.
కానీ తొలిసారి మారుతి సీనియర్ రైటర్లపై ఆధారపడినట్లు టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్..క్రేజ్ నేపథ్యంలోనే మారుతి ఇలా స్క్రిప్ట్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రసుతం ఆ పనులు తుది దశలో ఉన్నాయని సమాచారం. జూన్ వరకరూ అన్ని పనులు పూర్త షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని తెలిసింది.
ఈ సినిమా కోసం ప్రభాస్ 40 రోజులు కేటాయించారు. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ అని సమాచారం. అయితే ఈ సినిమా కోసం మారుతి క్రియేటివ్ పరంగా కొంత ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇతర రైటర్లపై ఆధార పడటం మారుతికి ఎంత వరకూ కలిసొస్తుందన్నది చూడాలి. మారుతి సొంత స్క్రిప్ట్ లు ఇంత వరకూ ఫెయిలైంది లేదు.
ఆయన సినిమాలన్నీ బాక్సీఫీస్ వద్ద మంచి వసూళ్లని సాధించాయి. మారుతికి ముందుగానే టైటిల్ పెట్టుకుని స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేయడం అలవాటు. ఇప్పటివరకూ అలాగే జరిగింది. కానీ 'డీలక్స్ రాజా' విషయంలో అంతా రీవర్స్ లో కనిపిస్తుంది. స్ర్కిప్ట్ మధ్యలో టైటిల్ డిసైడ్ అయింది. ఇప్పుడు కొత్త రైటర్లని రంగంలోకి దించడం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం మారుతి మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా 'పక్కా కమర్శియల్' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తిచేసుకుని జులై లో రిలీజ్ కానుంది. అనంతరం మారుతి పూర్తి స్థాయిలో 'డీలక్స్ రాజా'పై దృష్టలి సారించే అవకాశం ఉంది. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్' ఇటీవల రిలీజ్ అయి ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే.
అంతకు ముందు రిలీజ్ అయిన 'సాహో' నిరాశ పరించింది. ఇలా వరుసగా డార్లింగ్ ని రెండు సినిమా ఫలితాలు నిరుత్సాహ పరిచాయి. దీంతో ప్రభాస్ కి సక్సెస్ అనివార్యమైనట్లు కనిపిస్తుంది. ఇప్పుడా బాధ్యతలు పూర్తిగా మారుతి పైనే ఉన్నాయి.